Qatar vs Canada | జోనాదన్ తీన్‌మార్
Qatar vs Canada | ఫిఫా వరల్డ్ కప్-2026 ఆతిథ్య జట్టులో ఒకటైన కెనడా చారిత్రాత్మక విజయం సాధించింది. గ్రూప్-బీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఖతార్‌ను 6-0తో చిత్తుగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. జోనాథన్ డేవిడ్ హ్యాట్రిక్‌తో చేలరేగగా.. ఈ విజయంతో కెనడా రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో గ్రూప్ అగ్రస్థానానికి చేరుకుంది.
- ఖతార్‌పై కెనడా గోల్స్ వర్షం
- 6-0 తేడాతో మ్యాచ్‌లో విజయం
- నాకౌట్ రేసులో ముందంజ
Qatar vs Canada | ఫిఫా వరల్డ్ కప్-2026 ఆతిథ్య జట్టులో ఒకటైన కెనడా చారిత్రాత్మక విజయం సాధించింది. గ్రూప్-బీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఖతార్‌ను 6-0తో చిత్తుగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. జోనాథన్ డేవిడ్ హ్యాట్రిక్‌తో చేలరేగగా.. ఈ విజయంతో కెనడా రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో గ్రూప్ అగ్రస్థానానికి చేరుకుంది. సొంత అభిమానుల మధ్య బరిలోకి దిగిన కెనడా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. 16వ నిమిషంలో జోనాథన్ డేవిడ్ షాట్‌ను ఖతార్ గోల్‌కీపర్ మహ్ముద్ అబునాడా అడ్డుకోగా.. రీబౌండ్‌ను సైల్ లారిన్ గోల్‌గా మలిచి కెనడాకు తొలి ఆధిక్యం అందించాడు. 29వ నిమిషంలో డేవిడ్ పవర్‌ఫుల్ వాలీతో స్కోరును 2-0కి పెంచాడు. మ్యాచ్ 35వ నిమిషం తర్వాత పూర్తిగా మ్యాచ్ కెనడా వైపు మళ్లింది.

కెనడా ప్లేయర్ టాజోన్ బుకానన్ ఫౌల్ రివ్యూ తర్వాత ఖతార్ ప్లేయర్ హోమమ్ అహ్మద్‌కు రెడ్‌కార్డ్ చూపించడంతో ఆ జట్టు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. తొలి అర్ధభాగం ముగిసే ముందు డేవిడ్ మరో గోల్ సాధించి కెనడాకు 3-0 ఆధిక్యం అందించాడు. రెండో అర్ధభాగంలో ఖతార్‌కు మరిన్ని కష్టాలు పెరిగాయి. కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయెల్ కోనేపై ప్రమాదకర టాకిల్ చేసిన అస్సిమ్ మదీబోకు రెడ్ కార్డ్ పడడంతో ఖతార్ తొమ్మిది మందితోనే ఆటను కొనసాగించాల్సి వచ్చింది. కోనే గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడడం కెనడా శిబిరాన్ని ఆందోళనకు చేసింది. కోనే స్థానంలో వచ్చిన నాథన్ సలిబా ఫ్రీకిక్ ద్వారా నాలుగో గోల్ సాధించాడు. ఖతార్ మిడ్‌ఫీల్డర్ మహ్మద్ మన్నాయ్ చేసిన ఓన్‌గోల్‌తో స్కోరు 5-0కు చేరింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో డేవిడ్ మరోసారి గోల్ చేసి తన హ్యాట్రిక్‌ను పూర్తి చేయడంతో కెనడా 6-0తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కెనడా నాకౌట్ దశ అవకాశాలను మరింత పెంచుకుంది. తర్వాతి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌తో తలపడనుండగా.. బోస్నియాతో ఖతార్ ఆడనుంది.
మైదానంలో ఉద్రిక్తత..

మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కెనడా 6-0తో ఘన విజయం సాధించినప్పటికీ, ఫైనల్ విజిల్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం వాగ్వాదానికి దిగడం, ఒకరినొకరు తీసుకోవడం చర్చనీయాంశమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇరుజట్ల ఆటగాళ్లను విడదీశారు. కొద్దిసేపు మైదానంలో గందరగోళం నెలకొనగా, అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఉద్రిక్తతకు కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయెల్ కోనేకు జరిగిన గాయమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మ్యాచ్ సందర్భంగా ఖతార్ ఆటగాడు అస్సిమ్ మదిబో చేసిన టాకిల్‌లో కోనే తీవ్రంగా గాయపడి స్ట్రెచర్‌పై మైదానం వీడాడు. ఈ ఘటనపై రిఫరీ మదిబోకు రెడ్‌కార్డ్‌తో మైదానం వీడాడు. మ్యాచ్‌లో కెనడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే, ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై ఆరుజట్ల కోచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బోస్నియాపై స్విట్జర్లాండ్ ఘన విజయం..

Switzerland Vs Bosnia | ఫిఫా వరల్డ్ కప్-2026 గ్రూప్-బీ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 4-1తో బోస్నియా-హెర్జెగోవినాపై ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన స్విస్ జట్టుకు ఈ విజయం నాకౌట్ అవకాశాలను బలోపేతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ఒక్క గోల్ పడలేదు. దాదాపు 70 నిమిషాల పాటు ఇరు జట్లు సమానంగా పోరాడినా.. చివరి 20 నిమిషాల్లో స్విట్జర్లాండ్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 74వ నిమిషంలో యంగ్ ప్లేయర్ జోహన్ మంజాంబి అద్భుత గోల్‌తో స్విట్జర్లాండ్‌కు ఆధిక్యం అందించాడు. 80వ నిమిషంలో బోస్నియా డిఫెండర్ తారిక్ ముహరెమోవిచ్ ప్రత్యర్థి ఆటగాడిని అడ్డుకోవడంతో రెడ్‌కార్డ్‌తో మైదానాన్ని వీడాడు. దాంతో బోస్నియా పది మందితోనే ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత స్విస్ జట్టు దూకుడు మరింత పెంచింది. 84వ నిమిషంలో రూబెన్ వర్గాస్ రెండో గోల్ సాధించగా.. 90వ నిమిషంలో మంజాంబి రెండో గోల్ వేయడంతో స్కోర్ 3-0కి చేరింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో బోస్నియా తరఫున ఎర్మిన్ మహ్మిచ్ 90+3వ నిమిషంలో గోల్ చేసి తేడాను 3-1కు తగ్గించాడు. కలిసి వచ్చిన పెనాల్టీని కెప్టెన్ గ్రానిట్ షాకా 90+7వ నిమిషంలో గోల్‌గా మలచడంతో స్విట్జర్లాండ్ 4-1 విజయం ఖరారైంది. గ్రూప్-బీలో స్విస్ జట్టు తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. బోస్నియా నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తర్వాత మ్యాచ్‌లో తప్పక గెలువాల్సిన పరిస్థితి నెలకొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్






