త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Folk Dancer | హీరోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్స‌ర్ – సుకుమార్ సినిమాలో ఛాన్స్‌

తెలంగాణ ఫోక్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ తెలుగులో బంప‌రాఫ‌ర్ అందుకుంది. డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఆ సినిమా ఏది? హీరో ఎవ‌రంటే?

N

Entertainment | Published On Jun 19, 2026, 4.25 pm IST

Folk Dancer | హీరోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్స‌ర్ – సుకుమార్ సినిమాలో ఛాన్స్‌
Advertisement

Folk Dancer |  తెలంగాణ‌ ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా బిజీ అవుతోంది. ప్ర‌స్తుతం ధ‌నుష్ మేన‌ల్లుడితో త‌మిళ సినిమా చేస్తోంది. తాజాగా తెలుగులో ఈ ఫోక్ డ్యాన్స‌ర్ మ‌రో ల‌క్కీ ఛాన్స్ అందుకున్న‌ట్లు స‌మాచారం. సుకుమార్ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

మిలియ‌న్ల వ్యూస్‌....

నాగ‌దుర్గ న‌టించిన‌ ప‌లు ఫోక్ సాంగ్స్ సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచాయి. పేరుగ‌ల్ల పెద్దిరెడ్డి, తిన్న‌తీరం ప‌డుత‌లే, కాపోల్ల ఇంటికాడ సాంగ్స్ యూట్యూబ్‌లో వంద‌ల మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ ద‌క్కించుకున్నాయి. ఈ ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్ స్టార్‌గా మారిపోయింది. నాగ‌దుర్గ. ఈ సాంగ్స్ ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో క‌విలి వ‌నం మూవీలో హీరోయిన్‌గా న‌టించింది.

ల‌వ్ ఓ ల‌వ్‌...

ల‌వ్ ఓ ల‌వ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో  ఈ ఏడాదే కథానాయికగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌వీష్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమా ఇటీవ‌లే షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ త‌మిళ మూవీ రిలీజ్ కాక‌ముందే తెలుగులో నాగ‌దుర్గ మ‌రో బంపరాఫర్ అందుకుంది.

సుకుమార్‌...

ప్రియ‌ద‌ర్శి హీరోగా పుష్ప , పుష్ఫ 2 సినిమాల డైరెక్ట‌ర్ సుకుమార్ ఓ సినిమాను నిర్మించ‌బోతున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వెరైటీ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సుకుమార్‌తో పాటు బ‌న్నీవాసు మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇందులో ప్రియ‌ద‌ర్శికి జోడీగా నాగ‌దుర్గ హీరోయిన్‌గా ఫైన‌ల్ అయిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే వీరిద్ద‌రిపై ఓ లుక్ టెస్ట్ కూడా చేశార‌ట‌. సుకుమార్ నిర్మించ‌నున్న ఈ సినిమాతో వంశీరెడ్డి డైరెక్ట‌ర్‌గా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమ‌వుతున్నారు. జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement