త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్న‌రు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం

Dasoju Sravan | హిల్ట్ పాలసీ పేరుతో కంపెనీలను వేరే ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతోందని.. దాంతో పాటు 6 లక్షల కోట్ల రూపాయల దందా చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. ఎవరి జాగీరు అని రేవంత్‌రెడ్డి భూములు అమ్ముతున్నారని ఫైర‌య్యారు.

S

Telangana | Published On Jun 19, 2026, 4.18 pm IST

Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్న‌రు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం
Advertisement
  • ఎవ‌రి జాగీర‌ని భూములు అమ్ముతున్న‌రు
  • రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్‌కున్న విలువ‌లు నీకు లేవ్‌
  • సీఎం టైటిల్ తీసేసి రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ అని మార్చుకో
  • రేవంత్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ధ్వ‌జం

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: హిల్ట్ పాలసీ పేరుతో కంపెనీలను వేరే ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతోందని.. దాంతో పాటు 6 లక్షల కోట్ల రూపాయల దందా చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. ఈ పాలసీపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు ఉన్న విలువలు రేవంత్ రెడ్డికి లేవని.. ఎవరి జాగీరు అని రేవంత్‌రెడ్డి భూములు అమ్ముతున్నారని ఫైర‌య్యారు. సీఎం అనే టైటిల్ తీసేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మార్చుకోవాలని విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న ఎమ్మెల్యే కేపీ వివేకానందతో క‌లిసి తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.

పాల‌కులు తోట‌మాలితో స‌మానం..

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లు సిగ్గుపడే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రేవంత్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పాలకులు తోటమాలితో సమానం. ఫ్యూచర్ సిటీ పేరుతో బెదిరించి ప్రయివేటు భూములు లాక్కుంటున్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు ఏం గడ్డి పీకుతున్నారు? పేదవారు బంజారాహిల్స్‌లో ఉండొద్దా? ఏసీబీ ఆఫీసు ముందు ఉన్న భూమిని వేలానికి పెట్టారు అని దాసోజు ఆరోపించారు.

రేవంత్ పాపంలో అందరికీ వాటా ఉంది..

రేవంత్ రెడ్డిని ప్రజా కోర్టులో శిక్షించాలి. ప్రజా పాలన కాదిది.. ప్రజా దోపిడీ పాలన. హిల్ట్ పాలసీ దేశంలో అతి పెద్ద భూ కుంభకోణం. రేవంత్ రెడ్డి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారు. సీఎం అంటే కమీషన్ మినిస్టర్. రేవంత్ పాపంలో క్యాబినెట్‌లో ఉన్న అందరికి వాటా ఉంది. హిల్ట్ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది.

కేంద్రం కోటా ప్ర‌కార‌మే ధాన్యం కొంటామ‌ని రైతు డిక్ల‌రేష‌న్‌లో పెట్టాల్సింది..

రేవంత్ రెడ్డి ఏమైనా ఫత్వాలు జారీ చేస్తున్నారా? గతంలో ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కేంద్రం కోటా ప్రకారమే ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌లో ఈ అంశాన్ని ఎందుకు పెట్టలేదు. రైతులు రోడ్ల మీదకు రాకముందే ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఉపసంహరించుకోవాలి. రేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకోవద్దు అని దాసోజు శ్ర‌వ‌ణ్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement