Mekedatu Dam | మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Mekedatu Dam | కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన 'మేకెదాటు రిజర్వాయర్' (Mekedatu Dam) నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీ (Tamil Nadu Assembly)లో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
Mekedatu Dam | కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదం (Cauvery Water Dispute) మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన 'మేకెదాటు రిజర్వాయర్' (Mekedatu Dam) నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి అధికార పక్షంతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఇతర రాజకీయ పక్షాలు పూర్తి మద్దతు ప్రకటించడంతో అసెంబ్లీలో (Tamil Nadu Assembly) ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
కావేరి నదిపై ఆనకట్ట నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) ఈ తీర్మానాన్ని ఇవాళ సభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన 2007 నాటి కావేరి నీటి వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పును, 2018 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిందని, అలాగే నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల అంగీకారం లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండానే దీనిని ముందుకు తీసుకెళ్లారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఇలాంటి చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
ఈ డ్యామ్ నిర్మాణం చేపడితే దిగువన ఉన్న తమిళనాడులోని కావేరి డెల్టా పరివాహక ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, వారి జీవనాధారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పర్యావరణ, సాంకేతిక అనుమతులు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ వివాదం..
కావేరీ నదిపై రామనగర జిల్లా కనకపుర సమీపంలోని మేకెదాటు వద్ద ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. అయితే ఈ రిజర్వాయర్ (Mekedatu Dam) నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల తమ రాష్ట్రానికి రావాల్సిన కావేరి నీటి వాటా దెబ్బతింటుందని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంపై ఇటీవలే ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. ఇది సుప్రీంకోర్టు సమర్థించిన కావేరీ వాటర్ ట్రిబ్యునల్ (Cauvery Water Tribunal) నిర్ణయానికి పూర్తి విరుద్ధమని సీఎం విజయ్ తన లేఖలో ప్రధానంగా వాదించారు. మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయొద్దని, కావేరి ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం తమిళనాడు నీటి హక్కులను రక్షించాలని కోరారు. ఆ తర్వాత ప్రధానితో ముఖాముఖి భేటీలో కూడా మేకెదాటు అంశంపై విజయ్ చర్చించారు.
Also Read..
నీట్ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్.. ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
రాహుల్ గారూ.. మాకిచ్చిన హామీలు మర్చిపోయారు : తెలంగాణ నిరుద్యోగ యువత
వాట్సాప్‌లో కొత్త వాయిస్ నోట్ విడ్జెట్.. యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ పంపే అవకాశం..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి
- ●Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
- ●Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
- ●Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు

CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ






