Maharashtra Teachers Arrest | పాఠశాలలో పాకిస్థానీ పాట.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపై కేసు
Maharashtra Teachers Arrest | మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పాకిస్థానీ పాట ప్రదర్శించారన్న ఆరోపణలతో ప్రిన్సిపల్ సహా ఇద్దరు టీచర్లపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బజల్నా జిల్లాలో పర్టురు కిడ్స్ వరల్డ్ పాఠశాలలో గతేడాది పాకిస్థానీ పాటను ప్లే చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
- సోషల్ మీడియాలో వైరల్.. ఆలస్యంగా వెలుగులోకి
Maharashtra Teachers Arrest | త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పాకిస్థానీ పాట ప్రదర్శించారన్న ఆరోపణలతో ప్రిన్సిపల్ సహా ఇద్దరు టీచర్లపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బజల్నా జిల్లాలో పర్టురు కిడ్స్ వరల్డ్ పాఠశాలలో గతేడాది పాకిస్థానీ పాటను ప్లే చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
గతేడాది పాఠశాలలో నిర్వహించిన వార్షిక సమావేశంలో విద్యార్థులు పాకిస్థానీ పాటకు నృత్యం చేశారని నెటిజన్లు ఆరోపించారు. పాకిస్థానీ ఛాందసవాది ముంతాజ్ ఖాద్రీ ఫొటోను సైతం ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సదరు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని.. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక భాజపా ఎమ్మెల్యే బాబన్‌రావు లోనికర్ డిమాండ్ చేశారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగేలా పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను పాఠశాల యాజమాన్యం ఖండించింది. ప్రదర్శించిన పాట తుర్కియే టీవీ సీరియల్ ‘ఎర్తుగ్రల్ ఘాజీ’ నుంచి తీసుకున్నదని.. పాక్‌కు సంబంధించినది కాదని స్కూల్ ప్రిన్సిపాల్ సిద్ధిఖీ తెలిపారు. కొంతమంది తమ పాఠశాలకు చెడ్డ పేరు తేవాలనే కుట్రతో ఈ దృశ్యాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ప్రిన్సిపల్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లను అరెస్ట్ చేశామని చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNHRC | పెంచిన భూతమే కాటేస్తోంది.. సింధు జలాల ఒప్పందానికి కాలం చెల్లింది.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
జూన్ 19, 2026

Paraquat | పారాక్వాట్ గడ్డి మందుపై వైద్యుల ఆందోళన.. పూర్తిగా నిషేధించాల్సిందే అంటున్న నిపుణులు..
జూన్ 19, 2026

India In G7 | సభ్యదేశం కాదు.. అయినా భారత్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్న జీ7 దేశాలు.. న్యూఢిల్లీకి ఎందుకంత ప్రాధాన్యం..?
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Qatar vs Canada | జోనాదన్ తీన్మార్
- ●Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..
- ●Folk Dancer | సుకుమార్ సినిమాలో హీారోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్..
- ●Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
- ●Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నరు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం
- ●Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచర్ హెచ్చరికలతో ఐటీ షేర్లు ఢమాల్..

Qatar vs Canada | జోనాదన్ తీన్మార్

Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..

Folk Dancer | సుకుమార్ సినిమాలో హీారోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్..

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ



