Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..
Jio AI | రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 49వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో భారత డిజిటల్ రంగాన్ని మార్చేలా కొత్త ఏఐ ఆవిష్కరణలను ప్రకటించింది. జియో వినియోగదారుల కోసం ఐదు కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌లను తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. వీటిలో జియోభారత్ ఐక్యూ, ఏఐ వ్యాపార్, జియోహెల్త్ ఐక్యూ, జియోలెర్న్ ఐక్యూ, జియోకృషి ఐక్యూ ఉన్నాయి.
Technology | Published On Jun 19, 2026, 4.25 pm IST
Jio AI | రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 49వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో భారత డిజిటల్ రంగాన్ని మార్చేలా కొత్త ఏఐ ఆవిష్కరణలను ప్రకటించింది. జియో వినియోగదారుల కోసం ఐదు కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌లను తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. వీటిలో జియోభారత్ ఐక్యూ, ఏఐ వ్యాపార్, జియోహెల్త్ ఐక్యూ, జియోలెర్న్ ఐక్యూ, జియోకృషి ఐక్యూ ఉన్నాయి. అలాగే జియో నెట్‌వర్క్‌లోనే ఏఐని నేరుగా అనుసంధానిస్తూ వాయిస్ ఆధారిత ఏఐ కాల్ ఏజెంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఏఐ సేవలు 22 భారతీయ భాషలకు మద్దతుతో అందుబాటులోకి రానున్నాయి. జియోభారత్ ఐక్యూ వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్‌గా పనిచేస్తూ వినియోగదారుల వివిధ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. ఏఐ వ్యాపార్ ను చిన్న వ్యాపారులు, వ్యాపార సంస్థల కోసం రూపొందించారు. ఇది వారి ఉత్పాదకతను పెంచడంతోపాటు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ చెబుతోంది.
వివిధ రంగాల కోసం భిన్న ఏఐ వ్యవస్థలు..
ఆరోగ్య రంగానికి జియోహెల్త్ ఐక్యూ, విద్యార్థుల కోసం జియోలెర్న్ ఐక్యూ, రైతుల కోసం జియోకృషి ఐక్యూ అందుబాటులోకి రానున్నాయి. జియోలెర్న్ ఐక్యూ ద్వారా విద్యార్థులు తమ మాతృభాషలోనే చదువుకునే అవకాశం పొందుతారు. జియోకృషి ఐక్యూ పంటలు, విత్తనాలు, వాతావరణం, వ్యవసాయానికి సంబంధించిన ఇతర అంశాలపై రైతులకు సమాచారం అందించే ఏఐ వ్యవసాయ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఈ సేవలు జియో వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటాయని రిలయన్స్ తెలిపింది. ఇక జియో నెట్‌వర్క్‌లోకి రానున్న కొత్త ఏఐ కాల్ ఏజెంట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వినియోగదారులు కాల్ సమయంలో కేవలం హే జియో అని పిలిస్తే ఈ ఏఐ ఏజెంట్ యాక్టివ్ అవుతుంది. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో ఇది పనిచేస్తుంది. కాల్‌లను ట్రాన్స్‌క్రైబ్ చేయడం, కాన్ఫరెన్స్ కాల్‌లో గరిష్టంగా 10 మంది వేర్వేరు స్పీకర్లను గుర్తించడం, కాల్ సారాంశాలను రూపొందించడం వంటి సామర్థ్యాలు ఇందులో ఉంటాయి.
అనేక పనులు చేస్తుంది..
అలాగే ఈ ఏఐ ఏజెంట్ వినియోగదారుల తరఫున చర్యలు కూడా తీసుకుంటుంది. ఫుడ్ ఆర్డర్ చేయడం, క్యాబ్ బుక్ చేయడం, రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుంది. కాన్ఫరెన్స్ కాల్‌కు ఇతర వ్యక్తులను జోడించమని చెప్పినప్పుడు వారికి స్వయంగా కాల్ చేసి కనెక్ట్ చేస్తుంది. రిలయన్స్ దీన్ని ప్రతి కాల్‌లో అందుబాటులో ఉండే డిజిటల్ కన్సియర్జ్‌గా అభివర్ణించింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ మరో కీలక ఉత్పత్తి జియో టెలీఫ్రేమ్‌ను కూడా పరిచయం చేసింది. ఇది వాయిస్-ఫస్ట్ ఏజెంటిక్ ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్. వివిధ ఏఐ ఏజెంట్లను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందిస్తుంది. వినియోగదారుల అనుమతితో వారి తరఫున చర్యలు తీసుకోవడంతోపాటు సందర్భానుసారమైన సమాధానాలను కూడా అందిస్తుంది.
జియో టెలీఫ్రేమ్..
జియో టెలీఫ్రేమ్‌లో డే, కేర్, గెస్ట్, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, కనెక్టెడ్ హోమ్ వంటి విభాగాల కోసం ప్రత్యేక ఏఐ ఏజెంట్లు ఉంటాయి. ఏదైనా పని చేయడానికి ప్రత్యేక యాప్‌లను తెరవాల్సిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్ ద్వారానే పనులు పూర్తిచేయవచ్చు. ఈ ఏఐ వ్యవస్థ చేసిన ప్రతి చర్యకు సంబంధించిన రికార్డులను కూడా భద్రపరుస్తుంది. అలాగే ఏజెంటిక్ షాపింగ్ ఫీచర్‌ను కూడా జియో టెలీఫ్రేమ్‌లో అందించారు. వినియోగదారుల తరఫున చెల్లింపులు చేయడానికి ముందు తప్పనిసరిగా వారి అనుమతి తీసుకుంటుందని రిలయన్స్ స్పష్టం చేసింది. భారతీయ ప్రాంతీయ భాషలన్నింటిలోనూ ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
- ●Qatar vs Canada | జోనాదన్ తీన్మార్
- ●Folk Dancer | సుకుమార్ సినిమాలో హీారోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్..
- ●Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
- ●Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నరు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం
- ●Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచర్ హెచ్చరికలతో ఐటీ షేర్లు ఢమాల్..
- ●Paddy Procure | ధాన్యం నిల్వకు 20 ప్రాంతాల్లో అత్యాధునిక ధాన్య సైలోలు

Qatar vs Canada | జోనాదన్ తీన్మార్

Folk Dancer | సుకుమార్ సినిమాలో హీారోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్..

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ

Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నరు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం




