Paraquat | పారాక్వాట్ గడ్డి మందుపై వైద్యుల ఆందోళన.. పూర్తిగా నిషేధించాల్సిందే అంటున్న నిపుణులు..
Paraquat | భారత్‌లో వ్యవసాయ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న పారాక్వాట్ అనే కలుపు మొక్కల నివారణ మందుపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటలు, పొలాల్లో కలుపు మొక్కలను వేగంగా నాశనం చేసే ఈ హెర్బిసైడ్ మనుషులకు అత్యంత విషపూరితమైందిగా మారుతుందని చెబుతున్నారు.
Paraquat | భారత్‌లో వ్యవసాయ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న పారాక్వాట్ అనే కలుపు మొక్కల నివారణ మందుపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటలు, పొలాల్లో కలుపు మొక్కలను వేగంగా నాశనం చేసే ఈ హెర్బిసైడ్ మనుషులకు అత్యంత విషపూరితమైందిగా మారుతుందని చెబుతున్నారు. పారాక్వాట్ విషప్రయోగానికి ప్రస్తుతం సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు సహాయక చికిత్స మాత్రమే అందించగలుగుతున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ రసాయనానికి ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉండటంతో, దీని వినియోగంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోని 74 దేశాలు ఇప్పటికే పారాక్వాట్‌ను నిషేధించాయి. అయినప్పటికీ భారత్‌లో దీన్ని ఇంకా వ్యవసాయ భూముల్లో కలుపు మొక్కల నియంత్రణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా పనిచేయడం వల్ల రైతులు దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను తరచూ నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీన్ని మింగినప్పుడు లేదా శ్వాస ద్వారా శరీరంలోకి చేరినప్పుడు చాలా వేగంగా విషప్రభావం చూపిస్తుంది.
యాంటీ డోట్ లేదు..
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ థాట్స్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం పారాక్వాట్ శరీరంలో తీవ్రమైన ఆక్సిడేటివ్ నష్టాన్ని కలిగిస్తుంది. ఇది శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరితే తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. అలాగే శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మూత్రపిండాలు, కాలేయంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అత్యల్ప పరిమాణంలో తీసుకున్నా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండడంతోనే వైద్యులు దీన్ని సంపూర్ణంగా నిషేధించాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు ఇదే కారణంతో దీనిపై నిషేధం విధించాయి. యూరో-మెడిటరేనియన్ జర్నల్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంటిగ్రేషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం పారాక్వాట్ ను స్ప్రే చేసినప్పుడు సూక్ష్మ కణాల రూపంలో గాలిలో వ్యాపిస్తుంది. ఇవి ఊపిరితిత్తుల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో గాయాలు, మచ్చలు ఏర్పడి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం పారాక్వాట్ విషప్రయోగానికి విస్తృతంగా ప్రభావవంతంగా పనిచేసే యాంటీ డోట్ ఔషధం అందుబాటులో లేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
వ్యవసాయ పనుల్లో పారాక్వాట్ ను ఉపయోగిస్తే అది శరీరంలోకి ఏ రకంగానైనా చేరితే కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. ప్రారంభ లక్షణాల్లో నోటిలో పుండ్లు, వాంతులు, కడుపు నొప్పి ఉంటాయి. విషప్రభావం తీవ్రత పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రపిండాల వైఫల్యం, అవయవాల పనితీరు నిలిచిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్లు వైకే గుప్తా, రితేష్ అగర్వాల్ తెలిపిన ప్రకారం ఇటీవలి కాలంలో పారాక్వాట్ విషప్రయోగ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వీటిలో ప్రమాదవశాత్తూ జరిగేవి మాత్రమే కాకుండా ఉద్దేశపూర్వకంగా జరిగే ఘటనలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. పారాక్వాట్ సులభంగా అందుబాటులో ఉండటం, మరణాల శాతం అధికంగా ఉండటం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. రైతుల్లో అవగాహన కొరత కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. సులభంగా లభించడం వల్ల స్వీయహానికి సంబంధించిన అనేక ఘటనల్లో కూడా ఈ రసాయనాన్ని ఉపయోగిస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య వ్యవస్థలు తీవ్రమైన విషప్రభావాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
రక్షణ పరికరాలు ధరించినా వృథాయే..
యూరోపియన్ యూనియన్‌తోపాటు ఆసియా, ఆఫ్రికాలోని పలు దేశాలు పారాక్వాట్ వినియోగాన్ని నిషేధించాయి. మానవ ఆరోగ్యానికి అంగీకరించలేని స్థాయిలో ప్రమాదం కలిగించడాన్ని ప్రధాన కారణంగా పేర్కొన్నారు. రక్షణ పరికరాలు ధరించినప్పటికీ పూర్తిస్థాయిలో భద్రత కల్పించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో పారాక్వాట్ వినియోగం నియంత్రణలో ఉన్నప్పటికీ పూర్తిస్థాయి నిషేధం అమల్లో లేదు. రైతుల మరణాలు, ఉద్దేశపూర్వక విషప్రయోగ ఘటనలు నమోదైనప్పటికీ ఇది ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉంది. హెర్బిసైడ్ల వినియోగ నియంత్రణలో ఉన్న లోపాలు దీనిపై నియంత్రణను కష్టతరం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మరింత కఠినమైన అమలు చర్యలు, విధాన మార్పులు అవసరమని సూచిస్తున్నారు.
పూర్తిగా నిషేధించాల్సిందే..
పారాక్వాట్ వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించాలంటే దీని వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయడం లేదా దశలవారీగా నిషేధం విధించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రైతులకు సురక్షితమైన ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజల్లో అవగాహన పెంచి ప్రారంభ లక్షణాలను గుర్తించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే ఆసుపత్రుల్లో విషప్రయోగ అత్యవసర చికిత్స వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పారాక్వాట్ భారత్‌లో ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల జరిగే విషప్రయోగాలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు, అవగాహన, కఠిన నియంత్రణలే ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Paddy Procure | ధాన్యం నిల్వకు 20 ప్రాంతాల్లో అత్యాధునిక ధాన్య సైలోలు
జూన్ 19, 2026

UNHRC | పెంచిన భూతమే కాటేస్తోంది.. సింధు జలాల ఒప్పందానికి కాలం చెల్లింది.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
జూన్ 19, 2026

Maharashtra Teachers Arrest | పాఠశాలలో పాకిస్థానీ పాట.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపై కేసు
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Qatar vs Canada | జోనాదన్ తీన్మార్
- ●Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..
- ●Folk Dancer | సుకుమార్ సినిమాలో హీారోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్..
- ●Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
- ●Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నరు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం
- ●Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచర్ హెచ్చరికలతో ఐటీ షేర్లు ఢమాల్..

Qatar vs Canada | జోనాదన్ తీన్మార్

Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..

Folk Dancer | సుకుమార్ సినిమాలో హీారోయిన్‌గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్..

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ



