TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
TG Police Jobs | నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా పోలీసు శాఖలో పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్, జైళ్లశాఖలో ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది.
- 7,437 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఎస్ఐ నుంచి వార్డర్ వరకు పోస్టులు
TG Police Jobs | నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా పోలీసు శాఖలో పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్, జైళ్లశాఖలో ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోలీస్ శాఖలో అత్యధికంగా 5,050 పోస్టులు ఉన్నాయి. ఇందులో సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) పోస్టులు 148, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ విభాగంలో 29 పోస్టులు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) 23 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్ 3,697, ఏఆర్ 1,052, ఎస్‌ఏఆర్‌సీపీఎల్ 24, డ్రైవర్ (పీటీవో) 20, మెకానిక్ (పీటీవో) 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులు ఉండగా.. వీటిలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 44 కాగా, కానిస్టేబుల్ పోస్టులు 1,380 ఉన్నాయని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
ఇక ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, సివిల్ డిఫెన్స్ విభాగంలో 790 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు 39, ఫైర్ ఫైటర్ పోస్టులు 751 ఉన్నాయి. జైళ్లు, కరెక్షనల్ సర్వీస్ విభాగంలో మరో 223 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ జైలర్ (మెన్స్) 14, డిప్యూటీ జైలర్ (మహిళలు) ఒకటి, వార్డర్ (పురుషులు) 196, వార్డర్ (మహిళలు) 12 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించినట్లు బోర్డు వెల్లడించింది. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో తెలిపింది. అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియలో అవసరమయ్యే ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని బోర్డు సూచించింది.
తెలంగాణ స్థానిక అభ్యర్థులకు సంబంధించి ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, బీసీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్లు, స్థానికత ధ్రువీకరణపత్రాలు, ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు అవసరమైతే సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తుకు ముందే సివిల్ సర్జన్ ద్వారా వైద్య పరీక్షలు చేయించుకుని శారీరక, వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో నిర్ధారించుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. రాష్ట్రంలో ఒకేసారి పోలీస్, భద్రతా విభాగాల్లో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు
- ●Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
- ●Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!
- ●IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత
- ●Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ

Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..

CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!



