Bengaluru | ప్రపంచ ఫుడ్ మ్యాప్‌లో దుమ్మురేపిన బెంగళూరు.. 2026 బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాలో 13వ స్థానం..
Bengaluru | స్టార్టప్‌లు, ఐటీ పార్క్‌లకు మాత్రమే కాదు, అద్భుతమైన ఆహార సంస్కృతికి కూడా పేరు గాంచిన బెంగళూరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. క్రిస్పీ మసాలా దోసె నుంచి క్రాఫ్ట్ కాఫీ అనుభవాలు, ఎక్స్‌పెరిమెంటల్ మెనూల వరకు విభిన్న రుచులతో ఆకట్టుకుంటున్న ఈ నగరం, 2026 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల జాబితాలో 13వ స్థానాన్ని దక్కించుకుంది.
Bengaluru | స్టార్టప్‌లు, ఐటీ పార్క్‌లకు మాత్రమే కాదు, అద్భుతమైన ఆహార సంస్కృతికి కూడా పేరు గాంచిన బెంగళూరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. క్రిస్పీ మసాలా దోసె నుంచి క్రాఫ్ట్ కాఫీ అనుభవాలు, ఎక్స్‌పెరిమెంటల్ మెనూల వరకు విభిన్న రుచులతో ఆకట్టుకుంటున్న ఈ నగరం, 2026 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల జాబితాలో 13వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్ ఔట్ విడుదల చేసిన వరల్డ్స్ బెస్ట్ సిటీస్ ఫర్ ఫుడ్ 2026 జాబితాలో బెంగళూరు ఏకైక భారతీయ నగరంగా చోటు సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా 24వేల మందికి పైగా స్థానికులను సర్వే చేయడంతోపాటు ఫుడ్ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ను రూపొందించారు. టైమ్ అవుట్ నివేదిక ప్రకారం, బెంగళూరుకు ఫుడ్ నిపుణుల ప్యానెల్ నుంచి 60 శాతం స్కోర్ లభించగా, స్థానికుల నుంచి ఆహార నాణ్యతకు 82 శాతం రేటింగ్ వచ్చింది. దీంతో నగరం గ్లోబల్ టాప్-20 జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకుంది.
టాప్ 20 నగరాల జాబితా..
సవర్‌డో పిజ్జా బార్‌లు, నేచురల్ వైన్ స్పాట్‌లు, వినైల్ బార్-కమ్-బ్రూవరీలు వంటి ఆధునిక ఫుడ్ కాన్సెప్ట్‌లతోపాటు సంప్రదాయ రుచులను సమన్వయం చేస్తూ బెంగళూరు ప్రత్యేక గుర్తింపును సంపాదించిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఇందిరానగర్, కోరమంగల, ఎంజీ రోడ్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు సంప్రదాయం, ఆధునిక వంటకాల కలయికతో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. టైమ్ అవుట్ 2026 బెస్ట్ ఫుడ్ సిటీస్ టాప్-20 జాబితా ఇలా ఉంది. లైమా నగరం ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవగా తరువాతి స్థానంలో బ్యాంగ్‌కాక్ నిలిచింది. మూడో స్థానంలో మెక్సికో సిటీ స్థానం దక్కించుకుంది. తరువాతి స్థానాల్లో వరుసగా లండన్, బార్సిలోనా, హో చి మిన్హ్ సిటీ, మెల్‌బోర్న్, బీజింగ్, ఏథెన్స్, లిస్బన్, కేప్ టౌన్, ఒసాకా, బెంగళూరు (13వ స్థానం), నేపుల్స్, న్యూయార్క్, హాంగ్‌కాంగ్, బ్యూనోస్ ఐరోస్, మెర్సిల్, కోపెన్‌హాగన్, మెడెలిన్ నగరాలు నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్న నగరాల జాబితాలో బెంగళూరు స్థానం సంపాదించడం భారతీయ ఫుడ్ కల్చర్‌కు గర్వకారణంగా నిలిచిందని ఫుడ్ లవర్స్ అంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!

Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట






