QDENGA | భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్.. క్యూడెంగాకు ఆమోదం
QDENGA | భారత్‌లో డెంగీ వ్యాప్తి కట్టడికి కీలక ముందడుగు పడింది. తొలి డెంగీ వ్యాక్సిన్ (dengue vaccine)కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
QDENGA | త్రినేత్ర.న్యూస్ : భారత్‌లో డెంగీ వ్యాప్తి కట్టడికి కీలక ముందడుగు పడింది. తొలి డెంగీ వ్యాక్సిన్ (dengue vaccine)కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. జపాన్‌కు చెందిన 'తకేడా ఫార్మాసూటికల్స్' (Takeda Pharmaceuticals) సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా (Qdenga) వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మార్కెట్ అనుమతులు మంజూరు చేసింది. ఇది మన దేశంలో ఆమోదం పొందిన తొలి టీకా.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు తయారైన ఈ వ్యాక్సిన్ డెంగీ వైరస్‌కు చెందిన నాలుగు ప్రధాన రకాల (DENV-1, DENV-2, DENV-3, DENV-4)పై సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ టీకాను 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి అందించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా (0.5 ml చొప్పున) తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో డెంగీ సోకిన వారైనా, లేదా అసలు సోకని వారైనా ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండానే ఈ వ్యాక్సిన్‌ను నేరుగా తీసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం 'మేడ్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ బయోలాజికల్ ఇ (Biological E) భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్‌ను స్థానికంగా ఉత్పత్తి చేశారు. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటికే 43 దేశాల్లో ఆమోదం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్లకు పైగా డోస్‌లు పంపిణీ అయ్యాయి. ఈ వ్యాక్సిన్ సమర్థత, భద్రతను అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా 28,000 కంటే ఎక్కువ మందిపై 19కి పైగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ డెంగీ వల్ల వచ్చే తీవ్రమైన అనారోగ్యాన్ని, ప్రాణాపాయ స్థితిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని తేలింది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో 80 శాతం, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితిని (Hospitalization) 84% వరకు నివారిస్తుందని తేలింది. ఈ వ్యాక్సిన్ దాదాపు 7 సంవత్సరాల పాటు దీర్ఘకాలిక రక్షణను ఇస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ధర విషయానికొస్తే.. ఒక్కో డోసు రూ.3 వేల నుంచి రూ.6వేల వరకూ ఖర్చవుతుంది. రెండు డోసులకు కలిపి ఇంచుమించు రూ.12 వేల వరకూ అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు..
డెంగీ అనేది దోమల ద్వారా వ్యాపించే తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దాదాపు 125కిపైగా దేశాల్లో విస్తరించి.. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే మొత్తం డెంగీ కేసుల్లో దాదాపు మూడింట ఒక వంతు భారత్‌లోనే నమోదవుతున్నాయంటే తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఏటా లక్షలాది కేసులు వెలుగుచూస్తున్నాయి. 2023లో 2,89,235 డెంగీ కేసులు నమోదుకాగా ఆ తర్వాత ఏడాది అంటే 2024లో 2,33,519 కేసులు వెలుగుచూశాయి. 2025లోనూ లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం కారణంగా దోమల సంతానోత్పత్తి కాలం వేగంగా విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వివిధ రకాల వైరస్ జాతుల వ్యాప్తి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
తెలంగాణకు వర్ష సూచన..! 23 నుంచి మోస్తరు వర్షాలు..!!
వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలు భారీగా పెంపు..
కాంగ్రెస్ నేతల మెడల్లో బంగారు గొలుసులు తెంపుకెళ్లండి.. కేసు పెడితే నా దగ్గరకు రండి
సంబంధిత వార్తలు

Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..
సెప్టెంబర్ 18, 2026

UNSC | 9/11 సూత్రధారులు గుహల్లో దాక్కోలేదు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను మరోసారి ఎండగట్టిన భారత్
సెప్టెంబర్ 17, 2026

Russia sanctions bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ ఏమన్నదంటే..?
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Gadwal Vijaya Lakshmi | తొమ్మిదేళ్ల స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండ.. ప్రతి నెలా మందులు అందేలా ఏర్పాట్లు
- ●Duddilla Sridhar Babu | కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
- ●MLA Maheshwar Reddy | రిపేర్ల పేరుతో కాలం గడిపేస్తున్నారు
- ●Bigg Boss Thanuja | బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చేసిన సినిమా - హతఃపై తనూజ కామెంట్స్ - కిరణ్ అబ్బవరం నిర్మాతగా హారర్ మూవీ
- ●High Court Judgment | స్పీకర్ నిర్ణయం ఘోర తప్పిదం.. దానం నాగేందర్ ఇక నుంచి ఎమ్మెల్యే కాదు
- ●KUNO | కునోలో 56కి చేరిన చిరుతల సంఖ్య.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన కేజీపీ12

Gadwal Vijaya Lakshmi | తొమ్మిదేళ్ల స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండ.. ప్రతి నెలా మందులు అందేలా ఏర్పాట్లు

Duddilla Sridhar Babu | కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

MLA Maheshwar Reddy | రిపేర్ల పేరుతో కాలం గడిపేస్తున్నారు

Bigg Boss Thanuja | బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చేసిన సినిమా - హతఃపై తనూజ కామెంట్స్ - కిరణ్ అబ్బవరం నిర్మాతగా హారర్ మూవీ



