Bigg Boss Thanuja | బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చేసిన సినిమా – హతఃపై తనూజ కామెంట్స్ – కిరణ్ అబ్బవరం నిర్మాతగా హారర్ మూవీ
బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ తనూజ ప్రధాన పాత్రలో నటించిన హతః మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతుంది. హతః మూవీ టీజర్ శుక్రవారం రిలీజైంది. టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో తనూజతో పాటు కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ కీలక పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Sep 18, 2026, 7.12 pm IST
Bigg Boss Thanuja | టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఆరు సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు ప్రొడ్యూసర్‌గా కూడా కంటెంట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు. తిమ్మరాజుపల్లి టీవీ తర్వాత నిర్మాతగా ఓ హారర్ మూవీ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. హతః పేరుతో రూపొందిన ఈ హారర్ ఈ హారర్ మూవీలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీతో పాటు బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహించారు. తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి కిరణ్ అబ్బవరం ఈ సినిమాను నిర్మించారు.
టీజర్ లాంఛ్
హతః మూవీ టీజర్ శుక్రవారం రిలీజైంది. హారర్ ఎలిమెంట్స్‌తో ఈ టీజర్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో హతః మూవీపై తనూజ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ వెళ్లకముందు తాను చేసిన మూవీ ఇదని అన్నది. "హతః మూవీ కథను చెప్పడం కంటే స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను బిగ్ బాస్ కు వెళ్లకముందే నటించిన సినిమా ఇది. బిగ్ బాస్ తర్వాత ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్ లో ఈ సినిమా గురించి చెప్పాను. ఈ టీమ్ తో మూడేళ్లు జర్నీ చేశాను. డైరెక్టర్ అనుష్ డ్రీమ్ ఈ సినిమా. స్కెచ్ లతో డీటెయిల్డ్ గా కథ చెప్పారు. ఆయనకు కథ మీద ఉన్న నమ్మకమే నాలోనూ కాన్ఫిడెన్స్ పెంచింది. నవంబర్ 6న హతః మూవీ థియేటర్లలోకి వస్తోంది" అని తనూజ పేర్కొంది. "ఇదొక మిస్టికల్ థ్రిల్లర్ మూవీ. కొంత హారర్ ఉంటుంది. హతః కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్ లోనే ఎక్స్‌పీరియన్స్ చేస్తే బాగుంటుందని" దర్శకుడు అన్నారు.
నెక్ట్స్ ఏం జరుగుతుందో
ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "థియేటర్స్ లో ప్రతి సీన్ కు నెక్ట్స్ ఏం జరుగుతుందో అనే సర్ ప్రైజ్ కు ఆడియెన్స్ లోనవుతారు. సినిమా ఆద్యంతం కొత్త ఫీల్ కలిగిస్తుంది. సినిమా చూడటం పూర్తయ్యాక నాకు సినిమాలోని లింక్ పాయింట్స్ రీకాల్ చేసుకోవడానికి పదినిమిషాలు పట్టింది. డైరెక్టర్ ను పిలిచి అన్నీ అడిగి తెలుసుకున్నాను. రాబోయే దీపావళికి ఆడియెన్స్‌కు బెస్ట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. ఎడిటింగ్, మ్యూజిక్, విజువల్స్..ఇలా టెక్నికల్ గానే కాదు నటీనటుల పర్ ఫార్మెన్స్ పరంగా అన్నీఅదిరిపోతాయి. ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసే చిత్రమిది. అందుకే అన్ని భాషల్లో తీసుకొస్తున్నాం" అని చెప్పారు.
హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు కుష్లు సహ నిర్మాతగా వ్యవహరించింది. బిగ్‌బాస్ సీజన్ 9లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న తనూజ రన్నరప్‌గా నిలిచింది.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
సెప్టెంబర్ 9, 2026

Vaishnavi Chaitanya | ‘చెన్నై లవ్‌స్టోరీ’పై వైష్ణవి క్లారిటీ.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?
సెప్టెంబర్ 8, 2026

Horror Movie | కిరణ్ అబ్బవరం సినిమాలో బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ – హారర్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | 17 జిల్లాల్లో లోటు వర్షపాతం: రెవెన్యూ మంత్రి పొంగులేటి
- ●Uttamkumar Reddy | ముందు తాగునీరు.. తర్వాతే సాగునీరు
- ●ఎర్రవల్లి భూముల రాజకీయం: రేవంత్ రెడ్డి అసలు వ్యూహం ఇదేనా?
- ●IPhone 18 | ఐ ఫోన్ 18తో సెలిబ్రిటీలు - ట్రెండ్ అవుతోన్న ఫొటోలు
- ●Vemula Prashanth Reddy | ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి మంచి గుణపాఠమిది
- ●Harish Rao | దానం వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు : హరీశ్‌రావు

Ponguleti Srinivas Reddy | 17 జిల్లాల్లో లోటు వర్షపాతం: రెవెన్యూ మంత్రి పొంగులేటి

Uttamkumar Reddy | ముందు తాగునీరు.. తర్వాతే సాగునీరు

ఎర్రవల్లి భూముల రాజకీయం: రేవంత్ రెడ్డి అసలు వ్యూహం ఇదేనా?

IPhone 18 | ఐ ఫోన్ 18తో సెలిబ్రిటీలు - ట్రెండ్ అవుతోన్న ఫొటోలు



