త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KUNO | కునోలో 56కి చేరిన చిరుత‌ల సంఖ్య‌.. నాలుగు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన కేజీపీ12

KUNO | మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో భారత్‌లోనే పుట్టిన ఆడ చీతా కేజీపీ12 నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చీతాల సంఖ్య 52 నుంచి 56కు చేరింది. ప్రాజెక్ట్‌ చీతా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజే ఈ నాలుగు పిల్లలు జన్మించడం విశేషం. దేశంలో చీతాల సంఖ్యను సహజసిద్ధంగా పెంచే లక్ష్యంలో ఇది కీలక పరిణామమని అధికారులు పేర్కొన్నారు.

P

National | Published On Sep 18, 2026, 7.05 pm IST

KUNO | కునోలో 56కి చేరిన చిరుత‌ల సంఖ్య‌.. నాలుగు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన కేజీపీ12
Advertisement

KUNO | మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో భారత్‌లోనే పుట్టిన ఆడ చీతా కేజీపీ12 నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చీతాల సంఖ్య 52 నుంచి 56కు చేరింది. ప్రాజెక్ట్‌ చీతా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న మరుసటి రోజే ఈ నాలుగు పిల్లలు జన్మించడం విశేషం. దేశంలో చీతాల సంఖ్యను సహజసిద్ధంగా పెంచే లక్ష్యంలో ఇది కీలక పరిణామమని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాజెక్ట్‌ చీతా, కునో నేషనల్‌ పార్క్‌ బృందాలను అభినందించారు. నాలుగేళ్లలో నాలుగు కొత్త ప్రాణాలు పుట్టడం చీతాల సంరక్షణలో ఆశ, పట్టుదల, పురోగతికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం చీతాల సంఖ్య 56కు చేరగా.. ఇందులో 49 కునో నేషనల్‌ పార్క్‌లో, మరో మూడు గాంధీసాగర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నాయి.

చీతాల పునఃప్రవేశ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌లో ఇప్పటివరకు 32 చీతాలు జన్మించాయి. 2022 సెప్టెంబర్‌ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను కునోలో విడుదల చేయడంతో ప్రాజెక్ట్‌ చీతా ప్రారంభమైంది. దేశంలో చీతాలు అంతరించిపోయిన ఏడు దశాబ్దాల తర్వాత వాటిని తిరిగి తీసుకొచ్చారు. అనంతరం దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా నుంచి కూడా చీతాలను భారత్‌కు తరలించారు. తొలినాళ్లలో చీతాలను దేశానికి తీసుకురావడంపై దృష్టి పెట్టిన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం వాటి మనుగడ, సంతానోత్పత్తి, సహజసిద్ధంగా సంఖ్యను పెంచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కొన్ని చీతాలు మృతి చెందడంతో పర్యవేక్షణ, వైద్య సేవలు, నిర్వహణ విధానాల్లో మార్పులు చేశారు. ప్రాజెక్ట్‌ చీతా ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ కేజీపీ12కు జన్మించిన నాలుగు పిల్లలు కొత్త తరానికి నాంది పలికాయి. కునోకు అవతల చీతాల ఆవాసాలను విస్తరించే లక్ష్యంలో గాంధీసాగర్‌ ఇప్పటికే రెండో కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.

Advertisement
Advertisement