MLA Rakesh Reddy | కాంగ్రెస్ నేతల మెడల్లో బంగారు గొలుసులు తెంపుకెళ్లండి.. కేసు పెడితే నా దగ్గరకు రండి
MLA Rakesh Reddy | కాంగ్రెస్ సర్కార్ కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని.. అందుకే కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే వాళ్ల మెడల్లోని బంగారు గొలుసులు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పోలీసులు కేసులు పెడితే నా దగ్గరకు రండి.. నేను చూసుకుంటా అని వివాదాస్పదంగా మాట్లాడారు.
- ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ సర్కార్ కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని.. అందుకే కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే వాళ్ల మెడల్లోని బంగారు గొలుసులు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పోలీసులు కేసులు పెడితే నా దగ్గరకు రండి.. నేను చూసుకుంటా అని వివాదాస్పదంగా మాట్లాడారు.
ధైర్యంగా ఎక్కడ 13 వేల గ్రామాలల్ల, 33 జిల్లాలల్ల కాంగ్రెస్ నాయకుల మెడలల్ల బంగారు చైన్‌లు కనిపిస్తే ధైర్యంగా తీసుకెళ్లండి. పోలీసులు కేసులు పెడితే నా దగ్గరకు రండి. మీ వెంట నేనోస్తా. అది ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం. తులం బంగారం తూకం వేయండి. ఆ రిసిప్ట్ నాకు పెట్టండి. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తులం పోతే ప్రభుత్వం దగ్గర మూడు తులాలు కొట్టేస్తరు.
ఇప్పట్నుంచి ఇదే కాదు ప్రతిదానికి లెక్కగడుతున్నం. చివరగా చెబుతున్నా.. ముట్టడి చేయాలనుకుంటే 119 నియోజకవర్గాలల్ల ఒక్క కాంగ్రెస్ నాయకుడు తిరగడు. ముట్టడే చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ సైనికులు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, మహిళలు, అత్తలు, కోడండ్లు అందరూ తిరగబడతరు. ఆటో డ్రైవర్లు, కౌలు రైతులతో సహా ప్రతిఒక్కరు తిరగబడతరు. ప్రతిదాన్ని ప్రశ్నిస్తం.. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతం.
ప్రజలను చైతన్యం చేస్తం. రేవంత్‌రెడ్డిని, ఆయన సర్కార్‌ను గద్దే దించుతాం. అంతవరకు ఈ ఉద్యమం ఆగదు. రేవంత్‌ను ఓడగొట్టిన గడ్డ ఇందూరు గడ్డ. ఆయన ఓటమి ఇక్కడి నుంచే మొదలైంది. ఇది రాసి పెట్టుకోండి అని ఆయన హెచ్చరించారు.
కాగా ఇటీవలే ఇందూరు రణభేరి సభలో కాంగ్రెస్ నాయకుల షోరూమ్‌లల్లకు పోయి స్కూటీలు ఎత్తుకెళ్లాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మండిపడ్డారు. పోలీసులు కేసులు పెడతారేమోనని భయపడవద్దని, తన వద్దకు వస్తే తాను చూసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
అంకాపూర్‌లో రాకేశ్ రెడ్డి గృహనిర్బంధం..
నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్దకు బీజేపీ కార్యకర్తలు కర్రలతో రావడంతో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. చలో అంకాపూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆర్మూర్‌లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
బ్రేకింగ్
నిజామాబాద్ అంకాపూర్‌లో మరోసారి ఉద్రిక్తత
ఏకంగా పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని తన అనుచరులను సిద్ధంగా ఉంచిన బీజేపీ ఎమ్మెల్యే
తన ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
ఇస్సాపల్లి దాడికి జవాబు చెబుతామంటూ… pic.twitter.com/f9oL9Yht4n
— Telugu Feed (@Telugufeedsite) July 20, 2026
తాజావార్తలు
- ●Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ - పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ - ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?
- ●KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్!
- ●తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?
- ●Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు
- ●Udayabhanu | ఓటీటీలో యాంకర్ ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్
- ●Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్

Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ - పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ - ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?

KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?

Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు




