Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలు భారీగా పెంపు..
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన యాపిల్ మ్యూజిక్, యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఇప్పటికే ఈ సేవలను ఉపయోగిస్తున్న వినియోగదారులతోపాటు కొత్త యూజర్లకు కూడా పెంచిన చార్జిలను అమలు చేయనుంది.
Technology | Published On Jul 20, 2026, 1.47 pm IST
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన యాపిల్ మ్యూజిక్, యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఇప్పటికే ఈ సేవలను ఉపయోగిస్తున్న వినియోగదారులతోపాటు కొత్త యూజర్లకు కూడా పెంచిన చార్జిలను అమలు చేయనుంది. సవరించిన ధరలు ఇప్పటికే యాపిల్ ప్లాట్‌ఫామ్‌లలో అమల్లోకి రాగా, యాపిల్ మ్యూజిక్‌లోని ఇండివిడ్యువల్, ఫ్యామిలీ, స్టూడెంట్ ప్లాన్‌లతోపాటు యాపిల్ వన్ బండిల్ ప్లాన్‌లపై కూడా ప్రభావం పడింది. యాపిల్ చివరిసారిగా యాపిల్ మ్యూజిక్ ధరలను పెంచిన తర్వాత రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఈ తాజా ధరల పెంపు చేపట్టింది. ఇటీవల ఐప్యాడ్, మ్యాక్, మ్యాక్‌బుక్ వంటి పలు హార్డ్‌వేర్ ఉత్పత్తుల ధరలను కూడా కంపెనీ పెంచిన విషయం తెలిసిందే. యాపిల్ మ్యూజిక్ ఇండివిడ్యువల్ ప్లాన్ నెలవారీ ధర రూ.119 నుంచి రూ.139కు పెరిగింది. స్టూడెంట్ ప్లాన్ ధర కూడా రూ.59 నుంచి రూ.69కు పెరిగింది.
ఏయే ప్లాన్‌లో ఎంత పెంపు..
అత్యధిక పెంపు యాపిల్ మ్యూజిక్ ఫ్యామిలీ ప్లాన్ లో చోటు చేసుకుంది. ఈ ప్లాన్ ధర రూ.179 నుంచి రూ.229కు పెరిగింది. ఈ ప్లాన్ ద్వారా గరిష్టంగా ఆరుగురు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ షేరింగ్ ఫీచర్ ద్వారా ఒకే సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రతి వినియోగదారుడికి ప్రత్యేక మ్యూజిక్ లైబ్రరీ, వ్యక్తిగత సిఫార్సులు, ప్లేలిస్టులు అందుబాటులో ఉంటాయి. యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ బండిల్ ప్లాన్‌ల ధరలను కూడా కంపెనీ సవరించింది. భారత్‌లో యాపిల్ వన్ ఇండివిడ్యువల్ ప్లాన్ ధర రూ.175 నుంచి రూ.195కు పెరిగింది. ఫ్యామిలీ ప్లాన్ ధర రూ.365 నుంచి రూ.445కు పెరిగింది. అత్యంత ఖరీదైన ప్రీమియర్ ప్లాన్ ధర రూ.499 నుంచి రూ.595కు పెరిగింది. యాపిల్ వన్ ఒకే సబ్‌స్క్రిప్షన్ కింద పలు యాపిల్ సేవలను అందించే బండిల్ ప్లాన్. ఇందులో యాపిల్ మ్యూజిక్, యాపిల్ ఆర్కేడ్, యాపిల్ టీవీ ప్లస్, ఐక్లౌడ్ వంటి సేవలు ఉంటాయి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా స్టోరేజ్ సామర్థ్యాన్ని, ఇతర సేవలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ధరలు కూడా మారుతాయి.
ఇతర దేశాల్లోనూ..
భారత్‌తోపాటు యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా వంటి మార్కెట్లలో కూడా ఈ ధరల పెంపు చోటు చేసుకుంది. అయితే యాపిల్ ఇప్పటివరకు యాపిల్ మ్యూజిక్, యాపిల్ వన్ ధరల పెంపుపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇటీవల కంపెనీ భారత్‌తోపాటు ఇతర మార్కెట్లలో పలు హార్డ్‌వేర్ ఉత్పత్తుల ధరలను కూడా పెంచింది. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత, భాగాల తయారీ వ్యయాలు పెరగడం కారణంగా మ్యాక్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్, యాపిల్ టీవీ, హోమ్‌పాడ్ మోడళ్ల ధరలను పెంచినట్లు తెలిపింది. ప్రారంభంలో ఐఫోన్‌ల ధరలను మార్చకుండా ఉంచినప్పటికీ, తాజాగా జపాన్‌లో ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ 16 మోడళ్ల ధరలను కూడా పెంచినట్లు నివేదికలు వెల్లడించాయి.
తాజావార్తలు
- ●Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ - పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ - ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?
- ●KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్!
- ●తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?
- ●Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు
- ●Udayabhanu | ఓటీటీలో యాంకర్ ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్
- ●Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్

Srinidhi Shetty | పక్కనే హీరోయిన్ - పట్టించుకోని డైరెక్టర్ త్రివిక్రమ్ - ఆదర్శకుటుంబం సెట్స్‌లో ఏం జరిగిందంటే?

KTR | లక్ష కోట్ల భూముల ఆరోపణలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?

Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు





