త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Maheshwar Reddy | రిపేర్ల పేరుతో కాలం గడిపేస్తున్నారు

MLA Maheshwar Reddy | అధికారంలోకి వచ్చి మూడేండ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం ..ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా కాలం గడిపేస్తున్నదంటూ శుక్రవారం శాసన సభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

S

Telangana | Published On Sep 18, 2026, 7.15 pm IST

MLA Maheshwar Reddy | రిపేర్ల పేరుతో కాలం గడిపేస్తున్నారు
Advertisement
  • కాల్వల్లో లీకేజీలకు ఒక్క పైసా అయినా వెచ్చించారా?
  • ప్రాజెక్టులకు మరమ్మతులు చేయరా?
  • లిఫ్ట్ ల మోటార్లు ఎందుకు నడుస్తలేవు
  • బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి

MLA Maheshwar Reddy | త్రినేత్ర.న్యూస్ : అధికారంలోకి వచ్చి మూడేండ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం ..ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా కాలం గడిపేస్తున్నదంటూ శుక్రవారం శాసన సభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎల్ నినో పై జరిగిన చర్చలో భాగంగా ఆయన..ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేశారు. "డిస్కంలకు 35వేల కోట్లు, సింగరేణికి 64వేల కోట్లు బాకీ పడినందున వాటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంలో 6 నుంచి 8 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు.

ముఖ్యమంత్రి సొంత ఊరు కొడంగల్ లో రైతులు..కరెంటు కోసం ధర్నా చేశారంటే.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదిరిపేర్ల పేరుతో ఈ ప్రభుత్వం కాలం గడిపేస్తున్నది. గత ప్రభుత్వం తప్పు చేసిందా? లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పేరుతో మోసం చేశారా అనే విషయం పక్కన పెడితే.. మూడేండ్ల తర్వాత.. ఈ ప్రభుత్వం రిపేర్లు ఎందుకు చేయించలేదు. తక్షణం మరమ్మతులు చేయాలంటూ ఎన్డీఎస్ ఏ నిపుణులు నివేదిక ఇచ్చినా కాలయాపన చేస్తూ నీతి వాక్యాలు పలుకుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద కాల్వల ఆధునీకరణకు ఎందుకు వ్యయం  చేయలేకపోయారు. ఎందుకు కాల్వల్లో లీకేజీలను అరికట్టలేకపోతున్నారు. దేవాదుల, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు ఎందుకు నడపడం లేదు? "అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement
Advertisement