Gadwal Vijaya Lakshmi | తొమ్మిదేళ్ల స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండ.. ప్రతి నెలా మందులు అందేలా ఏర్పాట్లు
Gadwal Vijaya Lakshmi | గుండె సమస్యలతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తొమ్మిదేళ్ల చిన్నారి స్టెల్లాకు సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి అండగా నిలిచారు.
- బాధిత కుటుంబానికి గద్వాల్ విజయలక్ష్మి భరోసా
Gadwal Vijaya Lakshmi | త్రినేత్ర.న్యూస్: గుండె సమస్యలతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తొమ్మిదేళ్ల చిన్నారి స్టెల్లాకు సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి అండగా నిలిచారు. “ప్రజావాణికి వచ్చే ప్రతి వినతి వెనుక ఒక కుటుంబం, ఒక బాధ, ఒక ఆశ ఉంటుందన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో వెంటనే స్పందించడం మన బాధ్యత అని ఆమె తెలిపారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న కవిత ఒంటరిగా తన కుమార్తెను చూసుకుంటున్నారు. వైద్య ఖర్చులు భారంగా మారడంతో ఇటీవల సీఎం ప్రజావాణిని ఆశ్రయించి తన పరిస్థితిని గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు. వినతిపై వెంటనే స్పందించిన విజయలక్ష్మి చిన్నారికి అవసరమైన మందులు మధ్యలో ఆగకుండా అందేలా చర్యలు చేపట్టారు.
స్టెల్లా చికిత్సకు ప్రతి నెల సుమారు రూ.10 వేల విలువైన మందులు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెలనెలా అందేలా ఏర్పాట్లు చేసి శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో స్టెల్లా తల్లి కవితకు మెడిసిన్ కిట్‌ను అందజేశారు. దీంతో కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గద్వాల్ విజయలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
- ●MLA Maheshwar Reddy | రిపేర్ల పేరుతో కాలం గడిపేస్తున్నారు
- ●Bigg Boss Thanuja | బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చేసిన సినిమా - హతఃపై తనూజ కామెంట్స్ - కిరణ్ అబ్బవరం నిర్మాతగా హారర్ మూవీ
- ●High Court Judgment | స్పీకర్ నిర్ణయం ఘోర తప్పిదం.. దానం నాగేందర్ ఇక నుంచి ఎమ్మెల్యే కాదు
- ●KUNO | కునోలో 56కి చేరిన చిరుతల సంఖ్య.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన కేజీపీ12
- ●Ponguleti Srinivas Reddy | 17 జిల్లాల్లో లోటు వర్షపాతం: రెవెన్యూ మంత్రి పొంగులేటి
- ●Uttamkumar Reddy | ముందు తాగునీరు.. తర్వాతే సాగునీరు

MLA Maheshwar Reddy | రిపేర్ల పేరుతో కాలం గడిపేస్తున్నారు

Bigg Boss Thanuja | బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చేసిన సినిమా - హతఃపై తనూజ కామెంట్స్ - కిరణ్ అబ్బవరం నిర్మాతగా హారర్ మూవీ

High Court Judgment | స్పీకర్ నిర్ణయం ఘోర తప్పిదం.. దానం నాగేందర్ ఇక నుంచి ఎమ్మెల్యే కాదు

KUNO | కునోలో 56కి చేరిన చిరుతల సంఖ్య.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన కేజీపీ12




