త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UNSC | 9/11 సూత్రధారులు గుహల్లో దాక్కోలేదు.. ఐరాస వేదిక‌గా పాక్ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను మ‌రోసారి ఎండ‌గ‌ట్టిన భార‌త్‌

UNSC | 9/11 సూత్రధారులు ఎక్క‌డో మారుమూల గుహ‌ల్లో దాక్కోలేద‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది. వారు పాకిస్థాన్‌లోని ర‌క్షిత నివాస ప్రాంతాల్లోనే త‌ల‌దాచుకున్నార‌ని తెలిపింది. ఈ మేర‌కు ఐరాస వేదిక‌గా పాక్ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను మ‌రోసారి తీవ్రంగా ఎండ‌గ‌ట్టింది.

D

National | Published On Sep 17, 2026, 3.19 pm IST

UNSC | 9/11 సూత్రధారులు గుహల్లో దాక్కోలేదు.. ఐరాస వేదిక‌గా పాక్ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను మ‌రోసారి ఎండ‌గ‌ట్టిన భార‌త్‌
Advertisement

UNSC | త్రినేత్ర‌.న్యూస్ : ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (UNSC) వేదిక‌గా పాకిస్థాన్ (Pakistan)పై భార‌త్ మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. స‌రిహ‌ద్దులు దాటి ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న తీవ్ర‌వాద నెట్‌వ‌ర్క్‌లు, వాటి సుర‌క్షిత స్థావ‌రాల‌పై అంత‌ర్జాతీయ స‌మాజం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు పాక్‌ను ఉద్దేశించి ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేసింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో అఫ్ఘానిస్థాన్‌పై జరిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ఐరాస‌లో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి హ‌రీశ్ ప‌ర్వ‌త‌నేని (Harish Parvathaneni) మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సెప్టెంబర్ 11, 2001 (9/11) నాటి దాడుల చరిత్రను ప్ర‌స్తావించారు. ఈ దాడుల సూత్ర‌ధారులు ఎక్క‌డో మారుమూల గుహ‌ల్లో దాక్కోలేద‌ని స్ప‌ష్టం చేశారు. వారు పాకిస్థాన్‌లోని ర‌క్షిత నివాస ప్రాంతాల్లోనే త‌ల‌దాచుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు.

అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాదెన్ పాకిస్థాన్‌లోని అబోటాబాద్ (Abbottabad) ప‌ట్ట‌ణంలోని ఓ నివాస గృహంలో ఆశ్ర‌మం పొందిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అలాగే ఇతర కీలక 9/11 కుట్రదారులు నివాస, పట్టణ ప్రాంతాల్లోనే పట్టుబడిన ఉదంతాలను ఈ సందర్భంగా ఉదహరించారు. అదే త‌ర‌హా వాతావ‌ర‌ణం నేడు ల‌ష్క‌రే తోయిబా (LeT), జైషే మహ్మద్ (JeM), అల్-ఖైదా అనుబంధ సంస్థలకు రక్షణగా నిలుస్తోందని హెచ్చ‌రించారు. వాటిని అంత‌ర్జాతీయ స‌మాజం అడ్డుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు.

అదే స‌మ‌యంలో అఫ్ఘాన్ శరణార్థుల అంశాన్ని కూడా హ‌రీశ్ ప్ర‌ముఖంగా ప్రస్తావించారు. 30 ల‌క్ష‌ల మందికిపైగా శ‌ర‌ణార్థుల‌ను బ‌ల‌వంతంగా వారి స్వ‌దేశానికి పంప‌డంపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. శ‌ర‌ణార్థులు తిరిగి త‌మ దేశానికి వెళ్లే ప్ర‌క్రియ ఎలాంటి ఒత్తిడి, బ‌ల‌వంతం లేకుండా పూర్తిగా సుర‌క్షితంగా, గౌర‌వ‌ప్ర‌దంగా జ‌ర‌గాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Also Read..

మోదీ బ‌ర్త్‌డే.. 25 లక్షల దీపాల‌తో వెలుగులీన‌నున్న ఉజ్జ‌యిని

మహిళల సంక్షేమానికి పెద్దపీట.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

ఎన్‌ఎస్‌ఈ ఐపీవో నేడే.. షేర్‌ ధర రూ.1,785..

Advertisement
Advertisement