India-UK | జులై 15 నుంచి భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం అమలు
India-UK | భారత్-బ్రిటన్ (India-UK) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. వాణిజ్య ఒప్పందంతో పాటే సామాజిక భద్రతా ఒప్పందం (Agreement on Social Security Contributions) కూడా జూలై 15 నుంచే అమల్లోకి వస్తుందని ఇరు దేశాలూ సంయుక్తంగా ప్రకటించాయి.
India-UK | భారత్-బ్రిటన్ (India-UK) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ కీలక చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. వాణిజ్య ఒప్పందంతో పాటే సామాజిక భద్రతా ఒప్పందం (Agreement on Social Security Contributions) కూడా జూలై 15 నుంచే అమల్లోకి వస్తుందని ఇరు దేశాలూ సంయుక్తంగా ప్రకటించాయి.
ఈ ఒప్పందంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని, ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి కొత్త ఊపు తీసుకురానుందని మోదీ పేర్కొన్నారు.
ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గనున్నాయి.
కొన్ని రకాల మద్యంపై ప్రస్తుతం ఉన్న 150 శాతం టారిఫ్‌ను 40 శాతానికి తగ్గించనుండగా, వాహనాలపై 100 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయనున్నారు. అలాగే సౌందర్య ఉత్పత్తులపై గరిష్ఠంగా 22 శాతం వరకు టారిఫ్‌లు తగ్గనున్నట్లు బ్రిటన్ వెల్లడించింది.
Also Read..
చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం: సీఎం రేవంత్ రెడ్డి
సంబంధిత వార్తలు

America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
సెప్టెంబర్ 3, 2026

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
సెప్టెంబర్ 1, 2026

PM Modi | ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!
- ●Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్
- ●Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి
- ●Chanchalguda to Santoshnagar Flyover | పాతబస్తీ ట్రాఫిక్ కష్టాలకు చెక్: చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్
- ●BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్

Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్

Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి



