PM Kisan | రైతు భరోసా కంటే ముందుగానే పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు.. ఎప్పుడంటే?
PM Kisan | పంట పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు శుభవార్త. ఓ వైపు వానాకాలం సీజన్ (Kharif Season) రైతు భరోసా నిధులను (Rythu Bharosa) విడుదల విడుదల చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం సన్నద్ధమవతుండగా.. మరోవైపు కేంద్రం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు (PM Kisan) సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది.
PM Kisan | త్రినేత్ర.న్యూస్: పంట పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు శుభవార్త. ఓ వైపు వానాకాలం సీజన్ (Kharif Season) రైతు భరోసా నిధులను (Rythu Bharosa) విడుదల విడుదల చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం సన్నద్ధమవతుండగా.. మరోవైపు కేంద్రం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు (PM Kisan) సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 26న ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఖరీఫ్ సీజన్ పంటపెట్టుబడి సాయాన్ని విడుదల చేయనున్నారు. దానికి ఆరు రోజుల ముందే అంటే ఈ నెల 20న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమచేయనుంది.
23వ విడత నిధులను పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ వేదికగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే శనివారం (జూన్ 20) విడుదల చేయనున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా రూ.2,000 చొప్పున మూడు సమాన విడతలలో (ప్రతి 4 నెలలకు ఒకసారి) నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తున్నది.
డబ్బులు జమ కావాలంటే..
పీఎం సమ్మాన్ 23వ విడత రూ.2,000 జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలి. అదేవిధంగా సాగు భూమి రికార్డులు (Land Seeding) పీఎం కిసాన్ పోర్టల్‌తో అనుసంధానం, బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్, ఎన్‌పీసీఐ (NPCI) లింక్ అయి ఉండాలి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా?
పీఎం కిసాన్ డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి కిసాన్ సువిధ బెనిఫిషరీ స్టేటస్ (Kisan Suvidha Beneficiary Status) లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా అన్నదాతలు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే..
- ముందుగా PM Kisan వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'Farmers Corner' విభాగంలో 'Know Your Status' పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
- ఓటీపీని నమోదు చేస్తే మీ స్టేటస్ (డబ్బులు పడేది, లేనిది) కనిపిస్తుంది.
- ఇప్పటి వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే, పోర్టల్‌లోని 'New Farmer Registration' ఆప్షన్ ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Fuel prices | ముడి చమురు తగ్గినా.. ఇంధన ధరలను వెంటనే తగ్గించలేం: కేంద్రం
- ●Road Accident | మేడ్చల్‌లో కారు.. లింగాలఘనపూర్‌లో మినీ ట్రక్కు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
- ●England vs Croatia | రెచ్చిపోయిన కేన్.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!
- ●Haier HQLED P7 Pro | హైయర్ నుంచి కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు.. ధర తక్కువ, ఏఐ ఫీచర్లు..
- ●Meta AI | ఫేస్బుక్లో మెటా ఏఐ హంగామా.. సెర్చ్ నుంచి వీడియోల వరకు కొత్త ఫీచర్లు..
- ●India-UK | జులై 15 నుంచి భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం అమలు

Fuel prices | ముడి చమురు తగ్గినా.. ఇంధన ధరలను వెంటనే తగ్గించలేం: కేంద్రం

Road Accident | మేడ్చల్‌లో కారు.. లింగాలఘనపూర్‌లో మినీ ట్రక్కు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం

England vs Croatia | రెచ్చిపోయిన కేన్.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!

Haier HQLED P7 Pro | హైయర్ నుంచి కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు.. ధర తక్కువ, ఏఐ ఫీచర్లు..






