త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | పిల్ల‌ల‌తో ఉంటే ఆ ఆనంద‌మే వేరు

KTR | పిల్ల‌ల‌తోని గ‌డిపిన‌ప్పుడు వ‌చ్చే ఆనందం వేరే ఏ సంద‌ర్భంలో రాదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పిల్ల‌ల్లో ఎటువంటి క‌ల్మ‌షం ఉండ‌ద‌న్నారు. బేగంపేటలోని స్వామి రామానంద మెమోరియల్ మోడల్ స్కూల్‌లో ఆయ‌న‌ గురువారం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

S

Hyderabad | Published On Jun 18, 2026, 1.15 pm IST

KTR | పిల్ల‌ల‌తో ఉంటే ఆ ఆనంద‌మే వేరు
Advertisement
  • కేసీఆర్ హయాంలోనే 2023లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించాం
  • స్కూల్‌కు ఏం కావాల‌న్నా అడ‌గండి
  • రామానంద మెమోరియల్ మోడల్ స్కూల్ పిల్ల‌ల‌తో క‌లిసి భోజ‌నం చేసిన‌ కేటీఆర్‌

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: పిల్ల‌ల‌తోని గ‌డిపిన‌ప్పుడు వ‌చ్చే ఆనందం వేరే ఏ సంద‌ర్భంలో రాదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పిల్ల‌ల్లో ఎటువంటి క‌ల్మ‌షం ఉండ‌ద‌న్నారు. బేగంపేటలోని స్వామి రామానంద మెమోరియల్ మోడల్ స్కూల్‌లో గురువారం మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించారు. 2023లోనే కేసీఆర్ హ‌యాంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్య‌క్ర‌మం ప్రారంభించామ‌ని గుర్తు చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సేవలను ప్రశంసించారు.

వాణీదేవికి 240 మంది మ‌న‌వ‌రాళ్లున్నారు..

వాణీదేవికి 240 మంది మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు. వారే ఈ పిల్ల‌లు. ఇక్క‌డ చ‌క్క‌టి ప్రాంగ‌ణం, ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉంది. ఇంత చిన్న కార్య‌క్ర‌మానికి ఎందుకు పిలిచారో అనిపించింది. కానీ ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత ఇది ఎంత మంచి కార్య‌క్ర‌మ‌మో అర్థ‌మైంది. ఇక్క‌డ‌ బ‌ల‌హీన వ‌ర్గాల నుంచి వ‌చ్చిన పిల్ల‌లున్నారు. వారంద‌రికీ పౌష్టికాహారం అందించాల‌న్న స‌దుద్దేశంతో త‌ల‌సాని ట్ర‌స్టు త‌ర‌ఫున ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయం అని కేటీఆర్ పేర్కొన్నారు.

పీవీ అంత గొప్ప‌గా ఎద‌గాలి..

ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మాకు త‌ప్ప‌కుండా మ‌ళ్లీ అవ‌కాశం వ‌స్తుంది. అప్పుడు ఇంకా మెరుగ్గా ప‌ని చేస్తం. ఇక్క‌డ అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు, గ్రంథాల‌యంతో పాటు ఇంకా ఇత‌ర ఏం కావాల‌న్నా నాకుగానీ, త‌ల‌సానికి గానీ తెలియ‌జేయండి. పిల్ల‌లూ.. మీరు గొప్ప‌వాళ్లు కావాలి. పీవీ న‌ర‌సింహారావు అంత ఎద‌గాలి. 16 భాష‌లు అన‌ర్గ‌ళంగా మాట్లాడే అసాధార‌ణ ప్ర‌తిభ క‌లిగిన వ్య‌క్తి ఆయ‌న‌. చాలా గొప్ప నాయ‌కుడు. భార‌త జాతి మొత్తం ఎప్ప‌టికీ మ‌ర‌వ‌లేని నేత‌. ఆయ‌నంత‌ గొప్ప‌గా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంత‌రం విద్యార్థుల‌కు పుస్త‌కాల‌ను, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ట్ర‌స్టులో ప‌ని చేస్తున్న వారంద‌రికీ కేటీఆర్‌ అభినంద‌న‌లు తెలిపారు.

 

Advertisement
Advertisement