Revanth Reddy | చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy | గత పాలకులు చెరువుల కబ్జా చేయడం, అటవీ భూములను ఆక్రమించడంతో చినుకు పడితే చాలు హైదరాబాద్ (Hyderabad) అతలాకుతలమవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తమ పాలనలో చెరువుల పరిరక్షిస్తున్నామని, నాలాలను పునరుద్ధరిస్తున్నామని, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించి, పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే యజ్ఞం సాగుతున్నదని చెప్పారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: గత పాలకులు చెరువుల కబ్జా చేయడం, అటవీ భూములను ఆక్రమించడంతో చినుకు పడితే చాలు హైదరాబాద్ (Hyderabad) అతలాకుతలమవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తమ పాలనలో చెరువుల పరిరక్షిస్తున్నామని, నాలాలను పునరుద్ధరిస్తున్నామని, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించి, పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే యజ్ఞం సాగుతున్నదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో (Gurramguda Echo Park) నాగలింగం మొక్కను నాటి వన మహోత్సవం (Vana Mahotsavam) కార్యక్రమాన్ని సీఎం రేవంత్ గురువారం సాయంత్రం ప్రారంభించనున్నారు. అదేవిధంగా రూ.35.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా గత అనుభవాలను సీఎం పంచుకున్నారు.
గుర్రంగూడలో ప్రారంభించే వనమహోత్సవానికి ఒక ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదని, `మొక్క`వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుంచి తీసుకున్న సంకల్పానికి ఫలితమని చెప్పారు. `చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. ఫలితంగా చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం.. ఇదీ గత పాలనా దృశ్యం. చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించి, పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే యజ్ఞం… ఇది నేటి పాలన దృశ్యం.
2021లో ఇదే గుర్రంగూడలో వరదల సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా పర్యటించినప్పుడు నా మదిలో కలిగిన ఆవేదన నుంచి పుట్టిన ఆలోచనకు ఆచరణ ఈనాటి గుర్రంగూడ అటవీ భూమిలో జరిగే వనమహోత్సవం. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కబ్జాదారుల పై న్యాయపోరాటం చేసి, అటవీ భూములను రక్షించి, నగరాన్ని వనంలో జనం జీవించే ప్రాంతంగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి ఈరోజు నిర్వహించే గుర్రంగూడ వనమహోత్సవం ఒక ఉదాహరణ.` అంటూ ట్వీట్ చేశారు.
ఈ రోజు గుర్రంగూడలో ప్రారంభించే వనమహోత్సవం కు ఒక ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదు. “మొక్క”వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుండి తీసుకున్న సంకల్పానికి ఫలితం.
చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా… ఫలితంగా చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం…. ఇదీ గత… pic.twitter.com/Ev3xrGOlEs
— Revanth Reddy (@revanth_anumula) June 18, 2026
అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం
కాగా, గురువారం సాయంత్రం గుర్రంగూడ ఎకోపార్క్‌లో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునున్నారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17. 66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
తాజావార్తలు
- ●EPF | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖరు వరకు ఖాతాల్లో వడ్డీ జమ..
- ●Revanth Reddy | పేపర్‌లెస్‌గా మంత్రివర్గ సమావేశాలు.. డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం
- ●Vande Mataram | వందేమాతరాన్ని పక్కన పెట్టిన విజయ్ ప్రభుత్వం.. తమిళ గేయంతో అసెంబ్లీ ప్రారంభం
- ●Bankers | బ్యాంకర్లూ, జాగ్రత్త.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు: ఆర్బీఐ కొత్త ఆదేశాలు
- ●KTR | పిల్లలతో ఉంటే ఆ ఆనందమే వేరు
- ●Jeevan Reddy | రైతులను ఇక్కట్లకు గురిచేసేలా ప్రభుత్వ తీరు.. ధాన్యం కొనుగోలుపై భరోసానివ్వాలి: టీ.జీవన్ రెడ్డి

EPF | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖరు వరకు ఖాతాల్లో వడ్డీ జమ..

Revanth Reddy | పేపర్‌లెస్‌గా మంత్రివర్గ సమావేశాలు.. డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం

Vande Mataram | వందేమాతరాన్ని పక్కన పెట్టిన విజయ్ ప్రభుత్వం.. తమిళ గేయంతో అసెంబ్లీ ప్రారంభం

Bankers | బ్యాంకర్లూ, జాగ్రత్త.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు: ఆర్బీఐ కొత్త ఆదేశాలు




