Jeevan Reddy | రైతులను ఇక్కట్లకు గురిచేసేలా ప్రభుత్వ తీరు.. ధాన్యం కొనుగోలుపై భరోసానివ్వాలి: టీ.జీవన్ రెడ్డి
Jeevan Reddy | ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం చూస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ. జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆరోపించారు. ఇందులో భాగంగానే 7 రకాల సన్నాలను మాత్రమే సాగుచేయాలని ప్రకటనలు ఇస్తున్నదని విమర్శించారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్: ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం చూస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ. జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆరోపించారు. ఇందులో భాగంగానే 7 రకాల సన్నాలను మాత్రమే సాగుచేయాలని ప్రకటనలు ఇస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం సూచించిన ఆ 7 రకాల పంటలకు చీడ పురుగుల సమస్య తలెత్తుందని చెప్పారు. దిగుబడి లేని పంటలను సాగు చెయ్యమనడం సరికాదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ధ్యానం కొనుగోళ్ల పై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుందని, కానీ ఆరుగాలం పండించిన రైతు అడ్డీకి పావుసేరుకు ధ్యానం అమ్ముకున్నారని చెప్పారు. క్వింటాల్‌కు రూ.120 నుంచి రూ.243 వరకు అన్నదాత దోపిడీకి గురయ్యాడని చెప్పారు.
వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోపిడి చేశారని విమర్శించారు. ఈ దోపిడి తాము నిరూపిస్తామని, ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ధర్మకాంట తూకాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవాలు బయట పడతాయని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో YS రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ వచ్చిన కేసీఆర్ అండగా నిలబడి రైతాంగాన్ని ఆదుకున్నారని చెప్పారు.
ఇప్పుడైనా రూ.15 వేలు ఇవ్వండి..
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో రైతులు సాగులో ముందుకు పోలేక పోతున్నారని తెలిపారు. రబీ సీజన్ బోనస్‌ను ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని విమర్శించారు. రైతులను ఇక్కట్లకు గురి చేసేలా ఈ ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతు బంధు రూ.10 వేలు ఇస్తే, కాంగ్రెస్ రూ.15 వేలు ఇస్తామని రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ ఖరీఫ్ సీజన్‌లోనైనా రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అర్ధంకాని యూరియా యాప్..
యూరియా యాప్ తనకే అర్థం కావడం లేదని, ఇక సాధారణ రైతులకు ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ యూరియా కోసం యాప్ లేదని, మరి ఇక్కడ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందు వరి ధాన్యం పోసి ధర్నా చేస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడిండని, ప్రధాని మోదీ బడే బాయ్ అని చెప్పే ముఖ్యమంత్రి.. ధ్యానం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
రైతు బీమా ఏమైంది..
రైతు బీమా ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధ్యానం దోపిడి విచారణ చెయ్యకపోతే ఇదంతా ప్రభుత్వం కనుసన్నల్లో జరిగిందని భావించాల్సి వస్తుందని తెలిపారు. ఏ రకమైన పంట సాగు చేసినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ రైతు బీమా కోసం కుటుంబ సభ్యులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాయకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | పేపర్‌లెస్‌గా మంత్రివర్గ సమావేశాలు.. డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం
జూన్ 18, 2026

Revanth Reddy | చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం: సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 18, 2026

PM Kisan | రైతు భరోసా కంటే ముందుగానే పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు.. ఎప్పుడంటే?
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Adulterated Paneer Hyderabad | హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. 'ఫ్రెష్ పనీర్' ముసుగులో ప్రాణాలతో చెలగాటం
- ●Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Stock Markets | వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో లాభాలు.. కొనసాగుతున్న సూచీల ర్యాలీ..
- ●BJP Leader Burnt Alive | ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం
- ●Gold | బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!
- ●Damodar Raja Narasimha | దామోదర ఓ శాడిస్ట్ మంత్రి.. నిజాలు బయటపెడితే కేసులు పెట్టిస్తున్నడు

Adulterated Paneer Hyderabad | హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. 'ఫ్రెష్ పనీర్' ముసుగులో ప్రాణాలతో చెలగాటం

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు - ఒక్కోటి ఒక్కో జానర్

Stock Markets | వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో లాభాలు.. కొనసాగుతున్న సూచీల ర్యాలీ..

BJP Leader Burnt Alive | ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం



