Vande Mataram | వందేమాతరాన్ని పక్కన పెట్టిన విజయ్ ప్రభుత్వం.. తమిళ గేయంతో అసెంబ్లీ ప్రారంభం
Vande Mataram | టీవీకే ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం తమిళ జాతీయ గేయంతో సభా కార్యక్రమాలను ప్రారంభించారు.
Vande Mataram | తమిళనాడులో మే 10న జరిగిన ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో గీతాలాపన క్రమంపై పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వందేమాతరం స్థానంలో తమిళ జాతీయ గేయం తమిళ్ థాయ్ వాల్తు, జాతీయగీతం జనగణమన మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. ఇవాళ టీవీకే ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం తమిళ జాతీయ గేయంతో సభా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత చివర్లో జాతీయ గీతాన్ని ప్లే చేశారు. వందేమాతర (Vande Mataram) గీతాన్ని తొలగించారు.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. కార్యక్రమం ప్రారంభానికి ముందు వేదికపై మొదట వందేమాతరం గేయాన్ని ఆలపించగా, అనంతరం జనగణమనతో పాటు తమిళ్ థాయ్ వాల్తు ఆలపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వందేమాతరం అన్ని ఆరు చరణాలనూ ప్రదర్శించాలనే సూచనలు ఇవ్వడంతో, తమిళనాడు కొత్త ప్రభుత్వం ఆ నిబంధనలను పాటించింది.
అయితే, దీనిపై వివాదం చెలరేగింది. ప్రతిపక్షాలు, టీవీకే పార్టీకి మద్దతిచ్చిన మిత్రపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడు రాష్ట్ర గీతం ఎప్పటికీ మొదటి స్థానంలోనే ఉండాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
Also Read..
బ్యాంకర్లూ, జాగ్రత్త.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు: ఆర్బీఐ కొత్త ఆదేశాలు
గూగుల్ హోమ్ స్పీకర్ వచ్చేసింది.. జెమినీ ఏఐతో అప్‌డేట్.. ధర ఎంతంటే..?
సంబంధిత వార్తలు

Raghava Lawrence | డిప్యూటీ సీఎంగా రాఘవ లారెన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో
జూన్ 17, 2026

Crop Loan | రైతులకు గుడ్న్యూస్.. రూ. 75,000 వరకు పంట రుణాల మాఫీ
జూన్ 16, 2026

Thalapathy Vijay Divorce | సీఎం విజయ్ విడాకుల కేసు మరోసారి వాయిదా – భర్తతో తెగతెంపులపై సంగీత యూటర్న్?
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Adulterated Paneer Hyderabad | హైదరాబాద్లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. 'ఫ్రెష్ పనీర్' ముసుగులో ప్రాణాలతో చెలగాటం
- ●Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Stock Markets | వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో లాభాలు.. కొనసాగుతున్న సూచీల ర్యాలీ..
- ●BJP Leader Burnt Alive | ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం
- ●Gold | బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!
- ●Damodar Raja Narasimha | దామోదర ఓ శాడిస్ట్ మంత్రి.. నిజాలు బయటపెడితే కేసులు పెట్టిస్తున్నడు

Adulterated Paneer Hyderabad | హైదరాబాద్లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. 'ఫ్రెష్ పనీర్' ముసుగులో ప్రాణాలతో చెలగాటం

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు - ఒక్కోటి ఒక్కో జానర్

Stock Markets | వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో లాభాలు.. కొనసాగుతున్న సూచీల ర్యాలీ..

BJP Leader Burnt Alive | ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం



