Dharmapuri | ధర్మపురిలో విషాదం.. మహిళ ప్రాణం తీసిన కోతుల కొట్లాట
Dharmapuri | జగిత్యాల జిల్లా ధర్మపురిలో (Dharmapuri) విషాదం చోటుచేసుకుంది. కోతుల కొట్లాటలో (Monkey Fight) ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కొనపర్తి సత్యనారాయణ, పద్మ దంపతులు ఉంటున్నారు.
Dharmapuri | త్రినేత్ర.న్యూస్: జగిత్యాల జిల్లా ధర్మపురిలో (Dharmapuri) విషాదం చోటుచేసుకుంది. కోతుల కొట్లాటలో (Monkey Fight) ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కొనపర్తి సత్యనారాయణ, పద్మ దంపతులు ఉంటున్నారు. బుధవారం సాయంత్రం పద్మ తమ ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఇంటిపై కప్పిన రేకులపై చేరిన కోతులు కోట్లాడుకోసాగాయి.
ఈక్రమంలో రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన ఓ సిమెంటు ఇటుకను కిందికి తోసేశాయి. దీంతో అది కింద కూర్చున్న పద్మ తలపై పడింది. ఎత్తు నుంచి అది పడటంతో పద్మ తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. కళ్లముందే పద్మ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనే..
గత కోలంగా ధర్మపురిలో కోతుల వీరంగం సృష్టిస్తున్నాయి. తరచూ దాడులకు దిగుతున్నాయి. ఎటువైపు నుంచి ఏ కోతి వచ్చి మీద పడుతుందోనని స్థానికులు భయపడిపోతున్నారు. ఎటు చూసినా కోతుల గుంపే కనిపిస్తుండటంతో వణికిపోతున్నారు. పట్టణానికి చెందిన ఓ మహిళ గతంలో కోతుల భయంతో మిద్దె పైనుంచి పడి మృతి చెందింది.
తాజావార్తలు
- ●Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్
- ●Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- ●Redmi 17 5G | రెడ్మీ 17 5జి ఫోన్ వచ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయింది..
- ●Ponnam Prabhakar | దమ్ముంటే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయండి
- ●Earthquake | జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
- ●Talasani Srinivas Yadav | సెప్టెంబర్ 7లోగా జీవో 97 రద్దు చేయకుంటే సీఎం ఇంటి ముట్టడే

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్

Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Redmi 17 5G | రెడ్మీ 17 5జి ఫోన్ వచ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయింది..

Ponnam Prabhakar | దమ్ముంటే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయండి






