Keerthy Suresh | వెంకటేష్‌కు జోడీగా మహానటి – టాలీవుడ్‌లోకి బేబమ్మ రీఎంట్రీ – అనిల్ రావిపూడి మల్టీస్టారర్ లాంఛ్!
మన శంకర వరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ తర్వాత ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో లాంఛ్ అయ్యింది. ఈ మల్టీస్టారర్ మూవీలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Entertainment | Published On Jun 18, 2026, 11.08 am IST
Keerthy Suresh | హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడిలది టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్‌లో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్3, తో పాటు సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మన శంకర వరప్రసాద్‌గారులో వెంకటేష్ స్పెషల్ గెస్ట్ రోల్‌లో కనిపించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఐదో సినిమా రాబోతుంది. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో వెంకటేష్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నాడు.
గ్రాండ్‌గా లాంఛ్?..
ఈ మల్టీస్టారర్ మూవీ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఓపెనింగ్ ఈవెంట్‌తో ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరన్నది మేకర్స్ కన్ఫామ్ చేశారు. వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కథానాయికలుగా కనిపించబోతున్నారు.
రెగ్యులర్ షూటింగ్...
వెంకటేష్, కీర్తి సురేష్, కళ్యాణ్‌రామ్, కృతిశెట్టిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. జూన్ 24 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో రాఘవేంద్రరావుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి స్టైల్‌లో ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ మల్టీస్టారర్‌తో కృతి శెట్టి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ – రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 3, 2026

Ntr | నాన్‌స్టాప్‌గా షూటింగ్ – చెప్పిన డేట్‌కే థియేటర్లలోకి ఎన్టీఆర్ డ్రాగన్
సెప్టెంబర్ 3, 2026

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ – నాలుగోసారి కాంబో రిపీట్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!
- ●Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్

Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్



