Pawan Khera | పవన్ ఖేరాకు చుక్కెదురు.. సీఎం భార్యపై ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ
Pawan Khera | కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు చుక్కెదురైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మ (Riniki Bhuyan Sarma)పై చేసిన వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గౌహతి కోర్టు (Gauhati High Court) నిరాకరించింది.
Pawan Khera | కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు చుక్కెదురైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గౌహతి కోర్టు (Gauhati High Court) నిరాకరించింది. దీంతో ఈ పరువు నష్టం కేసులో ఆయన లొంగిపోయి రెగ్యులర్ బెయిల్ కోరే అవకాశం ఉంది.
కాగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మ (Riniki Bhuyan Sarma)పై పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రిణికి శర్మకు మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖేరాపై గౌహతిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో గౌహతి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వపన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 10న తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేసులో ఖేరాకు అరెస్టు నుంచి వారం రోజుల పాటూ కోర్టు ఊరట కల్పించింది. అంతలోపు ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బెయిల్ కోసం అస్సాంలోని కోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన గౌహతి కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 21 విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ఖేరా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు తీర్పుతో ఖేరా ఇప్పుడు లొంగిపోయి రెగ్యులర్ బెయిల్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read..
దీదీ దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం : అమిత్ షా
శంకర్ గౌడ్‌ది ముమ్మాటికి రేవంత్ సర్కార్ హత్యే.. రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు : కేటీఆర్
ఆత్మహత్యలొద్దు.. కలిసి కొట్లాడుదాం: ఆర్టీసీ కార్మికులకు బండి సూచన
సంబంధిత వార్తలు

Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం…: మహేశ్ గౌడ్
నవంబర్ 20, 2026

Khalid Saifullah | కోట నీలిమకు అసదుద్దీన్ ఒవైసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: డీసీసీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా
నవంబర్ 19, 2026

Gauhati High Court | పాన్ కార్డు, ఓటరు ఐడీ భారతీయ పౌరసత్వానికి ఆధారాలు కావు.. గువాహటి హైకోర్టు స్పష్టీకరణ
నవంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



