త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | ఆత్మ‌హ‌త్య‌లొద్దు.. క‌లిసి కొట్లాడుదాం: ఆర్టీసీ కార్మికుల‌కు బండి సూచ‌న‌

Bandi Sanjay | ఆర్టీసీ కార్మికులు తొంద‌ర‌ప‌డి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డొద్ద‌ని, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌లిసి కొట్లాడ‌దామ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ(Congress government) మొండి వైఖరి వల్లే డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ (Shankar Goud) ఆత్మహత్య చేసుకున్నాడని విమ‌ర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు.

S

News | Published On Apr 24, 2026, 12.58 pm IST

Bandi Sanjay | ఆత్మ‌హ‌త్య‌లొద్దు.. క‌లిసి కొట్లాడుదాం: ఆర్టీసీ కార్మికుల‌కు బండి సూచ‌న‌
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ కార్మికులు తొంద‌ర‌ప‌డి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డొద్ద‌ని, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌లిసి కొట్లాడ‌దామ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ(Congress government) మొండి వైఖరి వల్లే డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ (Shankar Goud) ఆత్మహత్య చేసుకున్నాడని విమ‌ర్శించారు. బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆర్టీసీకి తీరని అన్యాయం చేశాయని మండిప‌డ్డారు. కార్మికుల కోసమే శంకర్ ఆత్మ‌ బలిదానం చేసుకున్నాడ‌ని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు.

బండి సంజ‌య్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వ‌ల్ల‌ నర్సంపేటకి ఆర్టీసీ డ్రైవర్ విలువైన ప్రాణాలు తీసుకున్నాడ‌న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ఆర్టీసీలో 39 వేల మంది ఉద్యోగులు ఉన్నార‌ని, దుర్భర జీవితం గడుపుతున్నారని వాపోయారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కార్మికులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించార‌ని, ఆ స‌మ‌యంలో 20 మంది చనిపోవ‌డం బాధాక‌ర‌మ‌ని చెప్పారు. అప్పుడు 52 రోజుల పాటు సమ్మె జ‌రిగింద‌ని కార్మికుల కోసం కొట్లాడి తాము జైలుకు వెళ్లామ‌ని.. త‌మ‌ పోరాటం ఫలితంగానే బీఆర్‌ఎస్‌ దిగి వచ్చింద‌ని గుర్తు చేశారు.

భ‌స్మాసుర హ‌స్తం..

కాంగ్రెస్‌ది అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పింది. 900 రోజుల‌వుతున్నా ఆ డిమాండ్ల ఊసే లేదు. అందులో ఉన్న అంశాలనే కార్మికులు అడుగుతుండ‌డం త‌ప్పా. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం చేసిన‌ట్టే కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయ‌డం దుర్మార్గం. కేంద్రాన్ని అడిగి మీ మేనిఫెస్టో రూపొందించారా? బీఆర్ఎస్ ఆర్టీసీ కార్మికుల‌ను మోసం చేసిందనే మీకు ఓటు వేశారు. అలాంటప్పుడు కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు? అని ప్ర‌శ్నించారు.

బీజేసీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంది..

రాష్ట్ర ప్రభుత్వం త‌క్ష‌ణ‌మే వారిని ఒప్పించి మెప్పించి సమస్యల‌ను పరిష్కారించాలి. మంత్రుల యాభై శాతం జీతం కోత వల్ల‌ ఏం ప్రయోజనం? ఢిల్లీ, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలకి తెలంగాణ నుంచే డబ్బులు పోతున్నాయి. మంత్రులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల్లో సగం అమ్మినా కార్మికుల బాధలు తీర‌తాయి. ఆర్టీసీ కార్మికుల దీక్షకి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. లైసెన్స్, శిక్షణ లేనివారికి తాత్కాలిక ఉద్యోగాలు‌ ఇవ్వడం స‌రికాదు. ఆర్టీసీ కార్మికులు తొంద‌ర‌ప‌డొద్దు. ప్రాణాలు చాలా విలువైన‌వి. క‌లిసి కొట్లాడ‌దాం అని బండి కోరారు.

10 వేల బ‌స్సులు ఆగిన‌య్‌.. రోజూ 60 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌రు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వేరే విష‌యంలో ఉన్న శ్ర‌ద్ధ ఈ స‌మ్మెపై లేదు. స‌ర్వీసు నుంచి దిగిపోయినాక‌ ఆస‌రా పింఛ‌న్ కంటే వాళ్ల‌కు పింఛ‌న్ త‌క్కువ వ‌స్తది. బ్యాంకు లోన్లు కూడా ఇవ్వ‌రు. దారుణ‌మైన బ‌తుకులు వాళ్ల‌వి. జేబులో చిల్లి గ‌వ్వ కూడా ఉండ‌దు. రెండు పీఆర్‌సీ బ‌కాయిలు వెంట‌నే చెల్లిస్తం.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌హా ఆర్టీసీ కార్మికుల‌కు అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తాం.. అనే త‌దిత‌ర హామీలు ఇచ్చి ఇవాళ ద‌గా చేస్తున్న‌ది కాంగ్రెస్ ప్ర‌భుత్వం అని బండి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement