త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khalid Saifullah | కోట నీలిమకు అసదుద్దీన్ ఒవైసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: డీసీసీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా

Khalid Saifullah | సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన అవమానకర వ్యాఖ్యలను హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్ సైఫుల్లా (Khalid Saifullah) తీవ్రంగా ఖండించారు. ఆమెకు బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

G

Hyderabad | Published On Nov 19, 2026, 5.34 pm IST

Khalid Saifullah | కోట నీలిమకు అసదుద్దీన్ ఒవైసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: డీసీసీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా
Advertisement

Khalid Saifullah | త్రినేత్ర న్యూస్ : సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన అవమానకర వ్యాఖ్యలను హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్ సైఫుల్లా (Khalid Saifullah) తీవ్రంగా ఖండించారు. ఆమెకు బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగా సమాధానం చెప్పలేక ఒవైసీ ఒక మహిళను వివాదంలోకి లాగారని సైఫుల్లా విమర్శించారు. ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ఇటువంటి మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఓవైసీ రాజకీయ కార్యకలాపాలపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) వ్యంగ్యంగా స్పందిస్తూ, `మైనే తులసీ తేరే ఆంగన్ కీ అనే సినిమా ఉండేది కదా! ఇప్పుడు లక్నోలో మై ఒవైసీ తేరే ఆంగన్ కా అనే కొత్త సినిమా నిర్మిస్తున్నారు` అని వ్యాఖ్యానించారని చెప్పారు. పవన్ ఖేరా తన రాజకీయ వ్యంగ్యంలో ఓవైసీ కుటుంబంలోని ఏ మహిళనూ ప్రస్తావించలేదు. అయితే ఓవైసీ మాత్రం డాక్టర్ కోట నీలిమ ఎన్నికల ఓటమిని ఎగతాళి చేస్తూ, `ప్యారే, అప్నీ బేగమ్ కీ ఫికర్ కర్ లే. హమ్ మర్ద్ లోగోం కే కరీబ్ ఆవోగే తో నుక్సాన్ హోగా` అని వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యల వెనుక ఓవైసీ ఉద్దేశం ఏమిటని సైఫుల్లా ప్రశ్నించారు. ఓవైసీని రాజకీయంగా విమర్శించినందుకు పవన్ ఖేరా తన భార్య గురించి ఎందుకు ఆందోళన చెందాలి? ఇది ప్రజాస్వామ్య చర్చా? లేక రాజకీయ ప్రత్యర్థి భార్యను వివాదంలోకి లాగి బెదిరించే ప్రయత్నమా?” అని ప్రశ్నించారు. డాక్టర్ కోట నీలిమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న మహిళ, రాజకీయ నాయకురాలని సైఫుల్లా అన్నారు. ఒక మహిళ గౌరవాన్ని పురుషుడి బలహీనతగా భావించి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఒవైసీ వ్యాఖ్యలు అవాస్తవం

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోట నీలిమ (Kota Neelima) డిపాజిట్ కోల్పోయారని ఓవైసీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని సైఫుల్లా స్పష్టం చేశారు. కోట నీలిమకు వచ్చిన ఓట్లు: 22,492, ఓట్ల శాతం: 17.54% అని చెప్పారు. డిపాజిట్ నిలుపుకోవడానికి అవసరమైన ఓట్ల శాతం: 16.67 కంటే ఎక్కువని అన్నారు. ఎన్నికల ఫలితాల ప్రకారం కోట నీలిమ తన డిపాజిట్ కోల్పోలేదని స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు బహిరంగ వేదికపై ఇటువంటి భాషను ఉపయోగించడం ద్వారా తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తున్నారని మండిప‌డ్డారు. తమ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఎంఐఎం సమర్థిస్తుందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టాలి

ఓవైసీ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి, పూర్తి వీడియోను పరిశీలించి, ఆయన నుంచి వివరణ కోరడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని సైఫుల్లా కోరారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న హోదా, రాజకీయ పలుకుబడి లేదా మతపరమైన గుర్తింపు వల్ల ఓవైసీ జవాబుదారీతనానికి అతీతుడు కాలేరని స్పష్టం చేశారు. పవన్ ఖేరాను విమర్శించే హక్కు ఓవైసీకి ఉందని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు ఉందని, మా రాజకీయాలతో విభేదించే హక్కు కూడా ఉందని చెప్పారు. కానీ రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి ఒక మహిళ గౌరవాన్ని ఆయుధంగా ఉపయోగించే హక్కు ఆయనకు లేదన్నారు.

Advertisement
Advertisement