త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hardeep Singh Puri | ఇంధ‌న కొర‌త‌పై ఆందోళ‌న‌ల వేళ.. గ‌ల్ఫ్ దేశాల ప‌ర్య‌ట‌న‌కు కేంద్ర మంత్రులు

Hardeep Singh Puri | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా దేశీయంగా ఇంధ‌న కొర‌త‌పై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి (Hardeep Singh Puri) ఖతార్ (Qatar) ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు.

D

National | Published On Apr 9, 2026, 4.34 pm IST

Hardeep Singh Puri | ఇంధ‌న కొర‌త‌పై ఆందోళ‌న‌ల వేళ.. గ‌ల్ఫ్ దేశాల ప‌ర్య‌ట‌న‌కు కేంద్ర మంత్రులు
Advertisement

Hardeep Singh Puri | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా దేశీయంగా ఇంధ‌న కొర‌త‌పై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి (Hardeep Singh Puri) ఖతార్ (Qatar) ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఇవాళ‌, రేపు ఆయ‌న ఖ‌తార్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అయితే, ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇంధ‌న కొర‌తపై ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న వేళ మంత్రి ఖ‌తార్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా, భార‌త్ త‌న మొత్తం ఎల్‌పీజీ అవ‌స‌రాల్లో దాదాపు 50 శాతం అంత‌ర్జాతీయ మార్కెట్ నుంచే దిగుమ‌తి చేసుకుంటోంది. ఇందులో 40 శాతం వాటా ఒక్క ఖ‌తార్ నుంచే వ‌స్తుంది. అయితే, ఇరాన్ ప్ర‌తీకార దాడులతో ఖ‌తార్ ఇంధ‌న మౌలిక స‌దుపాయాలు దెబ్బ‌తిన్నాయి. ఇరాన్ దాడిలో ఖతార్‌కు ఉన్న 14 ఎల్‌ఎన్‌జి ప్లాంట్లలో (LNG trains) రెండు ప్లాంట్లు, ఒక గ్యాస్-టు-లిక్విడ్స్ (GTL) ప్లాంట్ దెబ్బ‌తిన్న‌ది. ఫ‌లితంగా ప్ర‌ధాన స‌హ‌జ వాయువు ఉత్ప‌త్తిని అక్క‌డి ప్ర‌భుత్వం నిలిపివేసింది. ఈ ప్లాంట్ల మ‌ర‌మ్మ‌తులు పూర్తి కావ‌డానికి దాదాపు మూడు నుంచి ఐదు సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. విదేశీ వ్యవహారాల మంత్రి (EAM) ఎస్. జైశంకర్ (S Jaishankar) కూడా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) ప‌ర్య‌ట‌న‌కు రెఢీ అయ్యారు. ఏప్రిల్ 11-12 తేదీల్లో యూఏఈలో పర్యటించ‌నున్నారు. ఇరాన్ యుద్ధం, మ‌ధ్య‌ప్రాచ్యంలో సంక్షోభం త‌ర్వాత భార‌త మంత్రి ఒక‌రు యూఏఈ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండ‌టం ఇదే మొద‌టిసారి. ఇరాన్‌-అమెరికా దేశాలు రెండు వారాల కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించిన కొన్ని గంట‌ల‌కే జైశంక‌ర్ యూఏఈ ప‌ర్య‌ట‌న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

Also Read..

ఇరాన్ 10-పాయింట్ల శాంతి ప్రతిపాదనను రాసింది చాట్ జీపీటీనే : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఎద్దేవా..!

ఏకగ్రీవానికి తొల‌గిన అడ్డంకులు.. బారామ‌తిలో సునేత్ర ప‌వార్ విజ‌యం లాంఛ‌నమే

తెలంగాణ ప్రేమ‌కథ‌తో అర్జున్ రెడ్డి డైరెక్టర్ మూవీ ....వెరైటీ టైటిల్ ఫిక్స్‌!

Advertisement
Advertisement