Ashada Masam 2026 | రేపట్నుంచే ఆషాఢం.. పుట్టింటి బాటలో కొత్త పెళ్లి కూతుళ్లు..! ఇక ఆ కార్యానికి దూరమేనా..?
Ashada Masam 2026 | హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి( Ashada Masam 2026 ) చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢ నక్షత్రంతో(పూర్వాషాడ/ఉత్తరాషాడ) కూడిన పౌర్ణమి వచ్చే మాసాన్ని 'ఆషాఢం'గా చెబుతారు.
Devotional | Published On Jul 14, 2026, 6.18 pm IST
Ashada Masam 2026 | త్రినేత్ర.న్యూస్ : హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి( Ashada Masam 2026 ) చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢ నక్షత్రంతో(పూర్వాషాడ/ఉత్తరాషాడ) కూడిన పౌర్ణమి వచ్చే మాసాన్ని 'ఆషాఢం'గా చెబుతారు. ఆషాఢ మాసంలో భక్తులు దేవుడి ఆరాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన ఆలుమగలను( Newly Wed Couple ) ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసుకుందాం.
ఆషాఢ మాసం ఎప్పటి వరకు అంటే..?
చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం తర్వాత వచ్చే నాలుగో మాసమే ఆషాఢం. ఈ ఏడాదిలో ఆషాఢ మాసం జులై 15వ తేదీన ప్రారంభమై ఆగస్టు 12న చుక్కల అమావాస్యతో ముగియనుంది. పూరీ జగన్నాథ రథయాత్ర, తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం, గురుపౌర్ణిమ, తెలంగాణలో మహంకాళి జాతర వంటి ఎన్నో పుణ్య పర్వాలు ఈ నెలలో వస్తాయి.
శుభకార్యాలకు ఆషాఢ మాసం పనికి వస్తుందా..?
ఆషాఢంను శూన్యమాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే సూర్యుడు మిథునరాశిలో ఉన్నప్పుడు ఆషాఢం వస్తుంది కాబట్టి. ఇక్కడ శూన్యం అంటే అశుభం అని అర్థం కాదు. ఆషాఢంలో వివాహాలు, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేయరాదని పండితులు చెబుతున్నారు. కానీ దైవరాధన, వ్రతాలు, గురుపూజలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. శుభకార్యాలకు విరామం ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందని పండితులు చెబుతున్నారు. అదేంటంటే.. పూర్వం ఆషాఢంలోనే వర్షాకాలం ప్రారంభమయ్యేది. ఆ సమయంలో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండేవారు. దీంతో శుభకార్యాలకు స్వల్పంగా విరామం ఇచ్చేవారని పెద్దలు చెబుతున్నారు.
మరి కొత్త జంటలు ఎందుకు దూరంగా ఉండాలి..?
మే, జూన్ మాసాల్లో పెళ్లైన వారికి ఆషాఢం ఒక రకంగా ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను విడివిడిగా ఉంచుతారు. నవ వధువును తన తల్లిగారింటికి పంపించేస్తారు. దీని వెనుకాల శాస్త్రీయమైన కారణం ఉందని పండితులు చెబుతున్నారు. పూర్వం వ్యవసాయానికి ఆషాఢం, శ్రావణమాసం వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన రోజులు. తొలకరి పలుకరించగానే రైతులు, వారి కుటుంబాలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవి. కానీ కొత్తగా పెళ్లైన దంపతులు వ్యవసాయ పనులకు దూరంగా ఉంటూ.. ఏకాంతంగా గడిపేందుకు అధిక సమయం కేటాయించేవారట. దీంతో కుటుంబ సభ్యుల మధ్య వ్యవసాయ పనుల విషయంలో మనస్పర్థలు ఏర్పడి.. తగాదాలకు దారి తీసేవట. ఈ గొడవలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురును పుట్టింటికి పంపేవారట.. ఆ ఆచారం నేటికి కూడా కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు.
దీంతో పాటు ఆషాఢంలో కనుక మహిళ గర్భం దాల్చితే.. ఆమెకు కచ్చితంగా వేసవిలోనే ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో ఎండాకాలంలో సరైన సదుపాయాలు, వైద్య సౌకర్యాలు లేకపోవడంతో.. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. కొత్త ఆలుమగలను విడివిడిగా ఉంచేవారట. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని.. ఆషాఢంలో కొత్త జంటలను దూరంగా ఉంచేవారని పండితులు పేర్కొంటున్నారు.
సంబంధిత వార్తలు

Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!
జులై 12, 2026

Horoscope | జూలై 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి..!
జులై 12, 2026

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
జులై 7, 2026
తాజావార్తలు
- ●Shah Rukh Khan | షారుఖ్ ఖాన్కు సుప్రీంకోర్టు ఊరట - మన్నత్పై కీలక తీర్పు
- ●CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!
- ●TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్లు అవసరం లేదు..
- ●Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు

Shah Rukh Khan | షారుఖ్ ఖాన్కు సుప్రీంకోర్టు ఊరట - మన్నత్పై కీలక తీర్పు

CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!

TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?



