Qatar | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు మృతి
Qatar | ఖతార్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అత్యంత కీలకమైన గ్యాస్ పోర్టులో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా, ఇందులో 12 మంది భారతీయులు ఉన్నారు.
International | Published On Jun 23, 2026, 7.08 am IST
Qatar | త్రినేత్ర.న్యూస్ : ఖతార్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అత్యంత కీలకమైన గ్యాస్ పోర్టులో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా, ఇందులో 12 మంది భారతీయులు ఉన్నారు. మిగతా ఒక్కరు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధ సమయంలో రస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. హర్మూజ్ మూసివేత కారణంగా గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఈ గ్యాస్ క్షేత్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో రస్ లఫాన్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కార్మికులు ప్రయత్నించగా.. అక్కడి బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో సాంకేతిక వైఫల్యం కారణంగా భారీ పేలుడు చోటుచేసుకొని పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతర్జాతీయ గ్యాస్ వాణిజ్యానికి రస్ లఫాన్ ఆయువుపట్టు వంటిది. ఇక్కడి నుంచి భారత్ సహా దాదాపు 30 దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతుంటుంది. తాజా పేలుడుతో ఈ సరఫరా గొలుసు దెబ్బతినే ముప్పుంది. బర్జాన్ గ్యాస్ ప్లాంట్ రోజుకు సుమారు 140 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
సంబంధిత వార్తలు

Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
జూన్ 22, 2026

JD Vance | పాకిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
జూన్ 20, 2026

Air Force One | అమెరికా అధ్యక్షుడికి కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్.. రూ.3 వేల కోట్ల జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఖతార్
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Hormuz Crisis | హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికాపై ఘాటు విమర్శలు
- ●Maa Inti Bangaram | మెగాస్టార్ ఇంట "బంగారం" సందడి.. సామ్ జంటకు చిరు దంపతుల సత్కారం
- ●Weather Report | దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు
- ●Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
- ●Norway vs Senegal | నాకౌట్లోకి నార్వే
- ●Cow | ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో

Hormuz Crisis | హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికాపై ఘాటు విమర్శలు

Maa Inti Bangaram | మెగాస్టార్ ఇంట "బంగారం" సందడి.. సామ్ జంటకు చిరు దంపతుల సత్కారం

Weather Report | దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు

Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్




