Shah Rukh Khan | షారుఖ్ ఖాన్‌కు సుప్రీంకోర్టు ఊరట – మన్నత్‌పై కీలక తీర్పు
షారుఖ్‌ఖాన్ నివాసం మన్నత్ రెన్నోవేషన్ పనులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులను షారుఖ్ ఖాన్ అక్రమంగా పొందారంటూ సంతోష్ దౌండ్కర్ అనే సామాజిక వేత్త వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది.
Entertainment | Published On Jul 14, 2026, 6.06 pm IST
Shah Rukh Khan | షారుఖ్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ వినిపించింది. మన్నత్ రెన్నోవేషన్‌కు సంబంధించి ఎదురైన అడ్డంకులపై ఈ బాలీవుడ్ నటుడికి అనుకూలంగా తీర్చు ఇచ్చింది. ముంబైలోని బంద్రా ఏరియాలో సముద్రానికి ఎదురుగా షారుఖ్‌ఖాన్ నివాసం మన్నత్ ఉంటుంది. 2001లో కేవలం పదమూడు కోట్లకు మన్నత్‌ను కొనుగోలు చేశారు షారుఖ్‌ఖాన్. ఇప్పుడు దాని విలువ రెండు వేల కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. మొత్తం ఆరు అంతస్తులతో కూడిన మన్నత్‌లో ప్రైవేట్ థియేటర్, అత్యాధునిక జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటి వసతులు ఉన్నాయి. షారుఖ్‌ఖాన్‌కు వచ్చిన అవార్డుల కోసమే మన్నత్‌లో ఓ గదిని కేటాయించినట్లు సమాచారం.
రెన్నోవేషన్...
కాగా మన్నత్‌కు అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించాలని షారుఖ్‌ఖాన్ ప్లాన్ చేశారు. ఈ రెన్నోవేషన్ పనులకు సంబంధించి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులు కూడా తీసుకున్నారు. తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘిస్తూ షారుఖ్‌ఖాన్ మన్నత్ రెన్నోవేషన్ పనులు చేపడుతున్నారంటూ ముంబైకి చెందిన సామాజిక వేత్త సంతోష్ దౌండ్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన డబ్బు, పలుకుబడిని ఉపయోగించి షారుఖ్‌ఖాన్ అక్రమంగా అనుమతులు పొందారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు విచారణ...
సంతోష్ దౌండ్కర్ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. చట్టపరంగా అన్ని అనుమతులు సవ్యంగానే తీసుకున్నారంటూ పేర్కొన్నది. అందులో ఎలాంటి లోపాలు లేవని అన్నది. సంతోష్ దౌండ్కర్ పిటిషన్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది. షారుఖ్ ఖాన్‌ను ఇమేజ్‌ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని కావాలనే ఈ పిటిషన్ వేసినట్లుగా ఉందంటూ పేర్కొన్నది. సుప్రీం తీర్పుతో మన్నత్ రెన్నోవేషన్ పనులకు సంబంధించిన అడ్డంకులు క్లియర్ అయ్యాయి.
ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ కింగ్ సినిమా చేస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్‌కు జోడీగా దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సంబంధిత వార్తలు

Sonam Wangchuk | సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష – బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు – కారణం ఇదే!
జులై 14, 2026

CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!
జులై 14, 2026

Alia Bhatt | కెరీర్లో ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో అలియా భట్ – నిమిషానికి కోటి రెమ్యూనరేషన్?
జులై 14, 2026
తాజావార్తలు
- ●Bengaluru Restaurants | బెంగళూరులో ఫుట్‌బాల్ ఫీవర్: అర్ధరాత్రి దాటాక 3.30 వరకు రెస్టారెంట్లకు పర్మిషన్!
- ●Ashada Masam 2026 | రేపట్నుంచే ఆషాఢం.. పుట్టింటి బాటలో కొత్త పెళ్లి కూతుళ్లు..! ఇక ఆ కార్యానికి దూరమేనా..?
- ●CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!
- ●TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..

Bengaluru Restaurants | బెంగళూరులో ఫుట్‌బాల్ ఫీవర్: అర్ధరాత్రి దాటాక 3.30 వరకు రెస్టారెంట్లకు పర్మిషన్!

Ashada Masam 2026 | రేపట్నుంచే ఆషాఢం.. పుట్టింటి బాటలో కొత్త పెళ్లి కూతుళ్లు..! ఇక ఆ కార్యానికి దూరమేనా..?

CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!

TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం



