Sandeep Vanga | తెలంగాణ ప్రేమకథతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ మూవీ ….వెరైటీ టైటిల్ ఫిక్స్!
డైరెక్టర్ సందీప్ వంగా ప్రొడ్యూసర్‌గా మారబోతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారట సందీప్ వంగా.
Entertainment | Published On Apr 9, 2026, 4.26 pm IST
Sandeep Vanga | టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉంటున్న అగ్ర దర్శకులు తమ అభిరుచులకు అనుగుణంగా చిన్న సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. సుకుమార్, త్రివిక్రమ్‌తో పాటు పలువురు దర్శకులు నిర్మాతలుగా మారి పెద్ద విజయాలను అందుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా కూడా చేరబోతున్నారు. తెలంగాణ ప్రేమకథతో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాను చేయబోతున్నారు.
తెలంగాణ యాసలో
సందీప్ వంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రొమాంచికం అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూ డిఫరెంట్‌గా ఈ లవ్‌స్టోరీ సాగనున్నట్లు చెబుతున్నారు. ఇందులో డైలాగ్స్ మాత్రం తెలంగాణ యాసలోనే ఉంటాయట.
సందీప్ వంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరినట్లు సమాచారం. త్వరలోనే రొమాంచికం సెట్స్‌పైకి రానుందట. సందీప్ వంగా నిర్మించనున్న ఈ సినిమాతో వేణు దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.
ప్రభాస్ స్పిరిట్....
మరోవైపు డైరెక్టర్‌గా ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ పాన్ ఇండియన్ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ మొదలైంది. త్వరలోనే గోవాలో మరో షెడ్యూల్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో స్పిరిట్ మూవీ తెరకెక్కుతోంది. మేము ఫేమస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్. ప్రస్తుతం గోదారిగట్టుపైనా సినిమా చేస్తున్నాడు. కోనసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Fahadh Faasil | పుష్ప విలన్‌తో రాజమౌళి కొడుకు తెలుగు హారర్ కామెడీ మూవీ – హీరోయిన్ లేకుండా ప్రయోగం
జులై 13, 2026

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ – నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ – ప్రొడ్యూసర్‌గా హీరో నాని
జులై 11, 2026

Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ – దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?
జులై 9, 2026
తాజావార్తలు
- ●KTR SIR | ఓటరు జాబితా సవరణ: ఫ్యామిలీతో కలిసి సర్ ఫారం నింపిన కేటీఆర్.. VIDEO
- ●Mudragada Padmanabham Passes Away | కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- ●SIR | 'సర్'లో అనేక లోటుపాట్లు.. ఎస్ఈసీకి బీఆర్ఎస్ వినతి
- ●Ponguleti Srinivas Reddy | 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు శ్రీకారం
- ●Bhatti Vikramarka | బావ, బామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదు : భట్టి విక్రమార్క
- ●Sonam Wangchuk | సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష - బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు - కారణం ఇదే!

KTR SIR | ఓటరు జాబితా సవరణ: ఫ్యామిలీతో కలిసి సర్ ఫారం నింపిన కేటీఆర్.. VIDEO

Mudragada Padmanabham Passes Away | కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

SIR | 'సర్'లో అనేక లోటుపాట్లు.. ఎస్ఈసీకి బీఆర్ఎస్ వినతి

Ponguleti Srinivas Reddy | 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు శ్రీకారం



