TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
TG BC Study Circle | తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ( TG BC Study Circle ) యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్–కమ్–మెయిన్స్)–2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
TG BC Study Circle | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ( TG BC Study Circle ) యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్–కమ్–మెయిన్స్)–2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోచింగ్ 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు హైదరాబాద్‌లో నిర్వహించబడుతుంది. మొత్తం 150 మంది అభ్యర్థులకు శిక్షణ అందించనుండగా, అందులో 100 మంది ఓపెన్ కేటగిరీ ద్వారా, 50 మంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఎంపిక చేస్తారు.
అర్హతలు ఇవే..
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
- కుటుంబ వార్షిక ఆదాయం:
- గ్రామీణ ప్రాంతం: రూ.1.50 లక్షలలోపు
- పట్టణ ప్రాంతం: రూ.2.00 లక్షలలోపు
- తెలంగాణ నివాసి కావాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలివే..
- నెలకు రూ.5,000 స్టైపెండ్ (ప్రభుత్వ నిబంధనల మేరకు)
- ఒకేసారి రూ.5,000 పుస్తక భృతి
- గ్రంథాలయ సౌకర్యం
- నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ
- స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, మార్గదర్శకత్వం
ముఖ్యమైన తేదీలు ఇవే..
- దరఖాస్తుల ప్రారంభం: 15-07-2026
- ఆన్‌లైన్ దరఖాస్తులు: 17-07-2026 నుంచి 07-08-2026 వరకు
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 13-08-2026 నుంచి
- స్క్రీనింగ్ టెస్ట్: 16-08-2026
- ఫలితాలు: 19-08-2026
- ధ్రువపత్రాల పరిశీలన: 21-08-2026 నుంచి
- తరగతుల ప్రారంభం: 24-08-2026
ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ తెలిపారు.
బీసీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ : https://tgbcstudycircle.cgg.gov.in/FirstPage.do
తాజావార్తలు
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్లు అవసరం లేదు..
- ●Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
- ●Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్
- ●Eggs Prices | హైదరాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. డజన్ రూ. 100 పైనే..!
- ●AI | ఏఐపై ప్రపంచ నిపుణుల హెచ్చరిక.. లక్షల ఉద్యోగాలకు ముప్పు..

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?

Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్లు అవసరం లేదు..

Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు

Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్




