Manideep Reddy Missing | ఫిన్లాండ్‌లో దొరికిన మృతదేహం మనిదీప్‌దేనా? డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ జైశంకర్‌కు దత్తాత్రేయ లేఖ!
ఫిన్లాండ్‌లో గల్లంతైన హైదరాబాద్ విద్యార్థి మనీదీప్ మిస్టరీ వీడలేదు. సముద్రంలో దొరికిన డెడ్ బాడీపై అనుమానాలతో విదేశాంగ మంత్రి జైశంకర్‌కు దత్తాత్రేయ లేఖ రాశారు.
- మే 6, 2026 నుంచి ఫిన్లాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మనీదీప్ రెడ్డి అదృశ్యం
- సముద్రంలో ఓ మృతదేహాన్ని గుర్తించి, అది మనిదీప్‌దేనని అనుమానిస్తున్న ఫిన్లాండ్ పోలీసులు
- ఆ డెడ్ బాడీ తమ కొడుకుది కాదని, కచ్చితంగా డీఎన్‌ఏ (DNA) టెస్ట్ చేయాలని పేరెంట్స్ డిమాండ్
- కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాసిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
Manideep Reddy Missing | త్రినేత్ర.న్యూస్ : ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ (Finland) వెళ్లి అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి గుజ్జ మనిదీప్ రెడ్డి వ్యవహారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సముద్రంలో దొరికిన ఒక మృతదేహం మనిదీప్‌దేనని అక్కడి పోలీసులు చెబుతుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్‌కు బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కీలక లేఖ రాశారు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌కు చెందిన బి.టెక్ విద్యార్థి మనిదీప్ రెడ్డి మే 6, 2026 నుంచి ఫిన్లాండ్‌లో కనిపించకుండా పోయాడు. అప్పటినుంచి అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, క్రూనువోరెన్‌రంటా (Kruunuvuorenranta) ప్రాంతంలోని సముద్రంలో ఒక మృతదేహం లభ్యమైందని, అది మే నెలలో అదృశ్యమైన భారతీయ విద్యార్థిదే అయి ఉండొచ్చని ఫిన్లాండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (NBI) అధికారులు మనీదీప్ తల్లిదండ్రులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. మరణానికి గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు వారు తెలిపారు.
మా కొడుకు కాదు.. డీఎన్‌ఏ టెస్ట్ చేయాలి
పోలీసుల సమాచారంతో మనిదీప్ తల్లిదండ్రులు ముత్యం రెడ్డి, మమతా రెడ్డి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే, సముద్రంలో దొరికిన ఆ డెడ్ బాడీ తమ కుమారుడిది కాదని వారు బలంగా నమ్ముతున్నారు. ఆ మృతదేహాన్ని నేరుగా చూసి గుర్తించే అవకాశం తమకు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, ఆ బాడీ మనీదీప్‌దే అని నిర్ధారించడానికి ముందు కచ్చితంగా డీఎన్‌ఏ (DNA) పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.
కేంద్ర మంత్రి జైశంకర్‌కు దత్తాత్రేయ లేఖ
కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బండారు దత్తాత్రేయ.. కేంద్ర మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. మనిదీప్ తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని, ఫిన్లాండ్ ప్రభుత్వంతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై లేఖ రాసిన సంగతిని ఆయన గుర్తుచేశారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఈ లేఖ రాయడానికి ముందు, జూలై 13న హైదరాబాద్ వనస్థలిపురంలోని వైదేహి నగర్ కాలనీలో ఉంటున్న మనిదీప్ కుటుంబ సభ్యులను దత్తాత్రేయ స్వయంగా కలిశారు. ఈ కేసులో జరుగుతున్న తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని, విద్యార్థిని క్షేమంగా తీసుకురావడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు.
Shri Bandaru Dattatreya, Former Governor, met Shri Muthyam Reddy & Smt. Mamatha Reddy, parents of https://t.co/lQClxQ4LVG student Gujja Manideep Reddy who has been missing in Finland since 6th May 2026, at their Hyderabad residence today.
Assured full support & efforts for his… pic.twitter.com/8zF8MsGOCV— Bandaru Dattatreya (@Dattatreya) July 13, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి






