Sabarimala prasadam | శబరిమల ప్రసాదంలో హలాల్ బెల్లం వినియోగం.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
Sabarimala prasadam | శబరిమల ప్రసాదం (Sabarimala prasadam) తయారీలో హలాల్ సింబల్ కలిగిన బెల్లం (Halal certified jaggery) వాడకంపై కేరళ హైకోర్టు (Kerala HC) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Sabarimala prasadam | త్రినేత్ర న్యూస్ : శబరిమల ప్రసాదం (Sabarimala prasadam) తయారీలో హలాల్ సింబల్ కలిగిన బెల్లం (Halal certified jaggery) వాడకంపై కేరళ హైకోర్టు (Kerala HC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప స్వామి ప్రసాదం తయారీకి సేకరించే పదార్థాలు కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు, మతపరమైన ఆచారాలకు అనుగుణంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (Travancore Devaswom Board)ను ఆదేశించింది. ఆలయ ప్రసాదం తయారీలో హలాల్ బెల్లం పౌడర్ వాడకంపై ఓ అయ్యప్ప భక్తుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్ వాదన
కాగా, 2021లో ఓ భక్తుడు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వామివారి ప్రసాదం తయారీకి ఉపయోగించే బెల్లం ప్యాకెట్లపై ‘హలాల్’ సర్టిఫికేషన్ ముద్రలు ఉన్నాయని, ఇది హిందూ మతాచారాలను ఉల్లంఘించడమేనని అందులో పేర్కొన్నారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ సంచుల్లో పాడైపోయిన బెల్లాన్ని సరఫరా చేశారని ఆరోపించారు. ఇలాంటి ప్రసాదం తింటే భక్తుల ఆరోగ్యం పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అలాంటి బెల్లం వాడకాన్ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశించాలని కోరారు. ఆలయంలో ప్రసాదం తయారీకి సాత్విక, స్వచ్ఛమైన, అధిక నాణ్యత గల పదార్థాలను మాత్రమే ఉపయోగించేలా సంబంధిత బోర్డు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పాడైపోయిన బెల్లాన్ని వేలంలో విక్రయించాం
ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ వివాదంపై దేవస్వం బోర్డు కోర్టుకు వివరణ ఇచ్చింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2019-20 సంవత్సరంలో పరిమిత ప్రసాదమే అవసరం కావడంతో మిగిలిన బెల్లం సన్నిధానంలో నిల్వ ఉండిపోయిందని తెలిపింది. 2021 ఏప్రిల్-సెప్టెంబర్‌లలో జరిపిన పరీక్షల తర్వాత ఆ బెల్లం వినియోగానికి పనికిరాదని తేలిందని కోర్టుకు తెలిపింది. దీంతో ఆ బెల్లాన్ని వేలంలో విక్రయించినట్లు వివరించింది.
హలాల్ సర్టిఫికేషన్‌కు గల కారణం..?
మరోవైపు బెల్లంపై హలాల్ సర్టిఫికేషన్‌కు గల కారణాన్ని ఫుడ్ సేప్టీ ఆఫీసర్ కోర్టుకు వివరించారు. మహారాష్ట్రకు చెందిన సదరు తయారీ సంస్థ గల్ఫ్ దేశాలకు బెల్లాన్ని ఎగుమతి చేయడానికి వీలుగా ప్యాకేజింగ్‌పై ‘హలాల్’ గుర్తును ముద్రించిందని తెలిపింది. అదే స్టాక్‌ను ఆలయ అవసరాలకు కూడా సరఫరా చేసిందని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయడం కోసమే సప్లయర్ ఆ సర్టిఫికేషన్ పొందారని, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం దీనివల్ల ఎలాంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.
కోర్టు ఏమన్నదంటే..?
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ వి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం దేవస్వం బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఉత్పత్తుల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది. వేరే మతపరమైన సూచనల వల్ల శబరిమలలో అనుసరించే మత విశ్వాసాలు, సంప్రదాయాలు దెబ్బతింటాయని కోర్టు అభిప్రాయపడింది. ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే లేదా భక్తుల్లో అనుమానాలు రేకెత్తించేలా ఎలాంటి గుర్తులు, చిహ్నాలు లేని పదార్థాలను మాత్రమే సేకరించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఇ-టెండర్ (e-tender) నిబంధనల్లోనే ఈ షరతులను చేర్చాలని దేవస్వం బోర్డును ఆదేశించింది. అనంతరం పిటిషన్‌ను క్లోజ్ చేసింది.
Also Read..
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు షాకిచ్చిన కస్టమ్స్ శాఖ
మీ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఇవి జరిగితే ఇల్లు సీజ్ చేస్తాం: సైబరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!
సెప్టెంబర్ 30, 2026

CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తమ ప్రజా సేవ అవార్డు
సెప్టెంబర్ 24, 2026

BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్లోనే అత్యధికం
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Physiotherapists Jobs | జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయణం - ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోషన్
- ●Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ●KTR | రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి
- ●CBI | రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కేసులో మరో ఛార్జ్‌షీట్.. 11 మందిపై సీబీఐ కేసు..
- ●India manufacturing PMI September 2026 | దూసుకెళ్లిన భారత తయారీ రంగం: 7 నెలల గరిష్టానికి పీఎంఐ.. భారీగా పెరిగిన ఉద్యోగాలు

Physiotherapists Jobs | జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..

Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయణం - ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోషన్

Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

KTR | రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి



