Harish Rao | ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర
Harish Rao | నాడు కాంగ్రెస్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఖతం చేస్తుంది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, పథకాన్ని మరుగున పడేలా చేస్తుంది అని ధ్వజమెత్తారు.
ఈ పథకాన్ని కాంగ్రెస్సే తెచ్చింది..
కాంగ్రెస్సే ఖతమే చేస్తుంది
జూనియర్, డిగ్రీ కాలేజీలు మూత
బలహీన వర్గాల విద్యార్థులకు విద్య దూరం
రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | త్రినేత్ర న్యూస్ : నాడు కాంగ్రెస్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఖతం చేస్తుంది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, పథకాన్ని మరుగున పడేలా చేస్తుంది అని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ.. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులతో హరీశ్‌రావు గురువారం సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సమైక్య పాలనలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాంటి మార్పు లేకుండా కేసీఆర్ అమలు చేశారు. గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా, ఏనాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆపలేదు. ప్రతి ఏటా సగటున రూ. 2 వేల కోట్లు, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం రూ. 19,500 కోట్ల నిధులు విడుదల చేశాం. ఈ ప్రభుత్వం ఈ మూడేండ్లలో సుమారు రూ. 400 కోట్లు మాత్రమే... ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతున్నది. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టారు. దానికి అతి గతి లేదు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, పథకాన్ని మరుగున పడేలా చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని మొన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయి. రెండు నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని, కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయి. మాటమీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత అంటూ స్పీచులు దంచే సీఎం గారు.. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు? అని హరీశ్‌రావు నిలదీశారు.
విద్యార్థుల పరీక్ష ఫీజులు కూడా చెల్లించని దారుణమైన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లకు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తాళాలు పడ్డాయి. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థలో తెచ్చిన కాంగ్రెస్ మార్క్ మార్పు అంటే ఇదేనా అంటూ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అన్నారు.. అటకెక్కించారు. మెగా డీఎస్సీ అన్నారు.. దగా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి ద్వారా ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసుకున్నామని నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క స్కూల్ కూడా బాగు చేయలేదన్నారు. సమైక్య పాలనలో 300 ఉన్న గురుకులాలను వెయ్యి గురకులాలు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించారని చెప్పారు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

B Vinod Kumar | 8 వేల ఎకరాల కబ్జాను తేల్చకుంటే సీఎం వ్యాఖ్యలను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్
అక్టోబర్ 1, 2026

DGP Anand | విద్య కోసం ఇచ్చే విరాళం ఎప్పటికీ విలువైనదే: డీజీపీ సీవీ ఆనంద్
అక్టోబర్ 1, 2026

Vedic and Scriptural Promotion Society | ముగిసిన వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●B Vinod Kumar | 8 వేల ఎకరాల కబ్జాను తేల్చకుంటే సీఎం వ్యాఖ్యలను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్
- ●Maxivision Hospital Case | టెస్టుల కోసం వెళ్తే సర్జరీ చేసినట్లు చూపించి క్లెయిమ్ కొట్టేసిన హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి
- ●Actor Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు షాకిచ్చిన కస్టమ్స్ శాఖ
- ●Cyberabad | అపార్ట్మెంట్లలో అక్రమ కార్యకలాపాలు.. ఆస్తులు జప్తు చేస్తామని పోలీసుల హెచ్చరిక
- ●DGP Anand | విద్య కోసం ఇచ్చే విరాళం ఎప్పటికీ విలువైనదే: డీజీపీ సీవీ ఆనంద్
- ●Vedic and Scriptural Promotion Society | ముగిసిన వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు

B Vinod Kumar | 8 వేల ఎకరాల కబ్జాను తేల్చకుంటే సీఎం వ్యాఖ్యలను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్

Maxivision Hospital Case | టెస్టుల కోసం వెళ్తే సర్జరీ చేసినట్లు చూపించి క్లెయిమ్ కొట్టేసిన హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి

Actor Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు షాకిచ్చిన కస్టమ్స్ శాఖ

Cyberabad | అపార్ట్మెంట్లలో అక్రమ కార్యకలాపాలు.. ఆస్తులు జప్తు చేస్తామని పోలీసుల హెచ్చరిక



