LPG e-KYC | గ్యాస్ ఈ-కేవైసీ.. రేపటితో ముగియనున్న గడువు..
LPG e-KYC | గ్యాస్ వినియోగదారులకు (Gas Cylinder) ముఖ్యగమనిక. మీరు ఈ-కేవైసీ (LPG e-KYC) పూర్తిచేశారా?. లేనట్లయితే తక్షణమే గ్యాస్ డీలర్‌నైనా సంప్రదించండి లేదా ఆన్‌లైన్‌లో నైనా కేవైసీ చేసేయండి. ఎందుకంటే మంగళవారంతో (జూన్ 30) గడువు ముగియనుంది.
LPG e-KYC | త్రినేత్ర.న్యూస్: గ్యాస్ వినియోగదారులకు (Gas Cylinder) ముఖ్యగమనిక. మీరు ఈ-కేవైసీ (LPG e-KYC) పూర్తిచేశారా?. లేనట్లయితే తక్షణమే గ్యాస్ డీలర్‌నైనా సంప్రదించండి లేదా ఆన్‌లైన్‌లో నైనా కేవైసీ చేసేయండి. ఎందుకంటే మంగళవారంతో (జూన్ 30) గడువు ముగియనుంది. కేవైసీ చేయని వారికి సబ్సిడీ (Gas Subsidy) నిలిచిపోనుంది.
ఎల్‌పీజీ కనెక్షన్లకు (LPG) ఆధార్ లింక్ (Aadhar Link) చేసి, నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను అమలు చేస్తున్నది. గతేడాది నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. అయినప్పటికీ చాలా మంది వినియోగాదారులు ఈ ప్రక్రియను పూర్తిచేయలేదు. జూన్ 30తో గడువు ముగిసిపోనుంది.
ఈ-కేవైసీ ఎలా చేయాలంటే?
వినియోగదారులు మూడు విధాలుగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక యాప్‌లలో స్వయంగా ఈ-కేవైసీ చేయవచ్చు. అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ సిబ్బంది సహాయంతో, అవసరమైతే నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవచ్చు.
ఈ-కేవైసీని ముఖ గుర్తింపు (Face Authentication), వేలిముద్రలు (Fingerprint), ఐరిస్ స్కాన్ (Iris Scan) ద్వారా వినియోగదారుల వివరాలను నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్యాస్ కనెక్షన్ వివరాలు అధికారికంగా అప్‌డేట్ అవుతాయి.

వారికి ప్రత్యేక నిబంధన
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద గ్యాస్ కనెక్షన్ పొందిన కుటుంబాలకు ఈ-కేవైసీ మరింత కీలకంగా మారింది. ఈ పథకం లబ్ధిదారులు ప్రతి ఏడాది తప్పనిసరిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ పూర్తిచేయని వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిఈ జమకావడం తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందాల్సి ఉంటుంది.
కేవైసీ చేయకపోయినా..
కాగా, ఈ-కేవైసీ పూర్తికాలేదనే కారణంతో సిలిండర్ బుకింగ్‌లను (Gas Cylinder Booking) ఆపోద్దని గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించి, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించింది.
తాజావార్తలు
- ●RTC Bus | వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
- ●WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త మాల్వేర్ అటాక్.. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేస్తే అంతే..
- ●OTT | ఏడు కోట్ల బడ్జెట్ - 3100 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●Earthquake | వరుస భూకంపాలు.. మొన్న అఫ్గానిస్థాన్.. నిన్న జపాన్.. నేడు చైనా
- ●Stock Markets | మళ్లీ మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు..
- ●Beer vs Cool Drink | కూల్‌డ్రింక్ కంటే బీరే మంచిదట.. అందులోనే చక్కెర, క్యాలరీలు తక్కువట!

RTC Bus | వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త మాల్వేర్ అటాక్.. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేస్తే అంతే..

OTT | ఏడు కోట్ల బడ్జెట్ - 3100 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ - తెలుగులో రిలీజ్

Earthquake | వరుస భూకంపాలు.. మొన్న అఫ్గానిస్థాన్.. నిన్న జపాన్.. నేడు చైనా






