Donald Trump | అప్పటి వరకూ టెహ్రాన్ చుట్టూనే అమెరికా సైన్యం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరికలు
Donald Trump | టెహ్రాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ కీలక హెచ్చరిక చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యే వరకూ అమెరికా దళాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని స్పష్టం చేశారు.
International | Published On Apr 9, 2026, 12.55 pm IST
Donald Trump | పశ్చిమాసియా (West Asia)లో గత 39 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాలు రెండు వారాలపాటూ తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం (ceasefire) చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనల వేళ టెహ్రాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ కీలక హెచ్చరిక చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యే వరకూ అమెరికా దళాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
"యుద్ధం ముగింపునకు సంబంధించి ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యే వరకూ అమెరికన్ నౌకలు, విమానాలు, అదనపు మందుగుండు సామగ్రి, ఆయుధాలు, సైనిక సిబ్బంది ఇరాన్, దాని పరిసర ప్రాంతాల్లోనే మోహరించి ఉంటాయి" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం.. ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదు, హర్మూజ్‌ను తెరిచే ఉంచాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గతంలో ఎన్నడూ చూడని విధంగా అమెరికా భారీ దాడికి దిగుతుందని హెచ్చరించారు.
Also Read..
ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. లేదంటూ ధ్వంసమే.. హర్మూజ్‌పై పట్టుకు ఇరాన్ కొత్త ప్లాన్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి.. హర్మూజ్‌ను మూసివేసిన ఇరాన్
సంబంధిత వార్తలు

Donald Trump | భారత్-పాక్ యుద్ధాన్ని అలా ఆపాను.. మళ్లీ పాతపాటే ఎత్తుకున్న ట్రంప్
జులై 3, 2026

Donald Trump | హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. థాంక్స్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు
జూన్ 27, 2026

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



