Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న – తొలి తెలుగు హీరోయిన్‌గా అరుదైన ఘనత
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేయబోతుంది. స్కాట్‌లాండ్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ ముగింపు ఉత్సవాల్లో రష్మిక మందన్న పాల్గొనబోతుంది. ఆమెతో పాటు సీనియర్ సింగర్ శంకర్ మహదేవన్ కూడా అటెండ్ కాబోతున్నట్లు ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.
Entertainment | Published On Jul 26, 2026, 11.31 am IST
Rashmika Mandanna | తెలంగాణ కోడలు రష్మిక మందన్న అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. 2026 కామెన్వెల్త్ గేమ్స్ స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జూలై 23 మొదలయ్యాయి.. ఆగస్ట్ 2న జరుగనున్న ముగింపు ఉత్సవాల్లో రష్మిక మందన్న పాల్గొనబోతుంది. నేషనల్ క్రష్‌తో పాటు సీనియర్ సింగర్ శంకర్ మహదేవన్ కూడా అటెండ్ కాబోతున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ కమిటీ అఫీషియల్‌గా ప్రకటించింది. కామన్వెల్త్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్న తొలి టాలీవుడ్ హీరోయిన్‌గా రష్మిక రికార్డ్ క్రియేట్ చేయబోతుంది.
స్పెషల్ పర్ఫార్మెన్స్....
కామన్వెల్త్ గేమ్స్ ముగింపు ఉత్సవాల్లో రష్మిక మందన్న స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. శంకర్ మహదేవన్, రష్మిక మందన్న నేతృత్వంలోనే భారతీయ కళాకారులు పలు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ డ్యాన్స్, మ్యూజిక్ పర్ఫార్మెన్స్‌లు ఉండనున్నట్లు చెబుతున్నారు. ఈ ముగింపు వేడుకల కోసం ఇప్పటికే రష్మిక ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె డ్యాన్స్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నట్లు చెబుతోన్నారు.
కర్టెన్ రైజర్‌లా...
2030 కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలోనే జరుగనున్నాయి. వాటికి కర్టెన్‌రైజర్‌లా ఉండేలా ఈ ముగింపు వేడుకలను గ్రాండ్‌గా ఇండియన్ ఒలింపిక్ కమిటీ నిర్వహించబోతుంది. ఈ ఈవెంట్‌లోనే కామన్వెల్త్ జెండాను భారత్‌కు అధికారికంగా అప్పగించబోతున్నారు. కామన్వెల్త్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్నతో పాటు స్కాట్‌లాండ్ రాక్ బ్యాండ్ సింపుల్ మైండ్స్, ఆస్ట్రేలియన్ సింగర్ డెల్టా గుడ్రెమ్, సాండీ థామ్, క్యామీ బార్స్న తదితరులు పాల్గొన్నారు.
రణబాలి....మైసా....
ప్రస్తుతం భర్త విజయ్ దేవరకొండతో కలిసి తెలుగులో రణబాలి సినిమా చేస్తోంది రష్మిక మందన్న. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. రణబాలితో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసాలో రష్మిక హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలోకి రాబోతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ – గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
జులై 26, 2026

Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య – విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
జులై 25, 2026

Rashmika Mandanna | ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ బోల్డ్ మూవీ – పెళ్లికి ముందు సీక్రెట్ ఎఫైర్ బయటపడితే…
జులై 25, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..



