త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప్ర‌జాశ‌క్తి ఎప్పుడూ గొప్ప‌దే.. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్..!

KTR | నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌త పార్టీ ఆధ్వ‌ర్యంలో యువ‌త చేప‌డుతున్న ఆందోళ‌న‌ల‌కు కేంద్రం త‌లొగ్గింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

P

Telangana | Published On Jul 25, 2026, 6.02 pm IST

KTR | ప్ర‌జాశ‌క్తి ఎప్పుడూ గొప్ప‌దే.. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్..!
Advertisement

KTR | నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌త పార్టీ ఆధ్వ‌ర్యంలో యువ‌త చేప‌డుతున్న ఆందోళ‌న‌ల‌కు కేంద్రం త‌లొగ్గింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆందోళ‌న‌లు రోజురోజుకు ఉధృతమ‌వుతుండ‌డం, ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌డంతో మోదీ స‌ర్కారు మెట్టు దిగివ‌చ్చింది. శుక్ర‌వారం ఎట్ట‌కేల‌కు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జెన్‌జీ సాధించిన విజ‌యంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు స్పందించారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్ర‌జా శక్తి ఎప్పుడూ గొప్పది అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రజల ఉద్యమాలు, ప్రజాభిప్రాయం ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టగలవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీ ఆరోపణలపై పెద్ద ఎత్తున విద్యార్థులు యువ‌త ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌లు చేప‌ట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సీజేపీతో పాటు విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

Advertisement
Advertisement