త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart Ration Cards | వ‌చ్చే నెల‌లో స్మార్ట్ రేష‌న్ కార్డుల పంపిణీ..!

Smart Ration Cards | రాష్ట్రంలోని రేష‌న్ కార్డుదారుల‌కు శుభ‌వార్త‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ రేష‌న్ కార్డుల‌ను (Ration Cards) అందించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ది. క్రెడిట్‌, డెబిట్ కార్డుల ప‌రిమాణంలో రూపొందించిన స్మార్ట్ రేష‌న్ కార్డుల‌ను (Smart Ration Cards) త్వ‌ర‌లో పంపిణీ చేయ‌నుంది.

G

Telangana | Published On Jul 26, 2026, 11.33 am IST

Smart Ration Cards | వ‌చ్చే నెల‌లో స్మార్ట్ రేష‌న్ కార్డుల పంపిణీ..!
Advertisement

Smart Ration Cards | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని రేష‌న్ కార్డుదారుల‌కు శుభ‌వార్త‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ రేష‌న్ కార్డుల‌ను (Ration Cards) అందించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ది. క్రెడిట్‌, డెబిట్ కార్డుల ప‌రిమాణంలో రూపొందించిన స్మార్ట్ రేష‌న్ కార్డుల‌ను (Smart Ration Cards) త్వ‌ర‌లో పంపిణీ చేయ‌నుంది. క్యూఆర్ కోడ్‌తో ఆధునిక హంగుల‌తో కూడిన ఈ స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ కూడా ఇప్ప‌టికే పూర్త‌యింది. ఆగ‌స్టు మొద‌టి వారంలో లేదా పంద్రాగ‌స్టు రోజున‌ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేపర్ రూపం నుంచి ప్లాస్టిక్ కార్డు రూపంలోకి రేషన్ కార్డులు రావడం ఇదే తొలిసారి. ఈ కార్డుపై లబ్ధిదారుడి (యజమాని) ఫోటోతో పాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,05,42,188 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,39,96,239గా ఉంది.

వ‌చ్చే నెల‌లో..

నూతన స్మార్ట్ కార్డులను ఆగ‌స్టు మొద‌టి వారంలో లేదా స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున పంపిణీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే ఎప్పుడు పంపిణీ చేయాల‌నే దానిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పంపిణీ ప్రక్రియను ప్రారంభించాల‌ని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్డులను లబ్ధిదారులకు అందించ‌నున్నారు.

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత‌..

2006లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కుటుంబ స‌భ్యుల‌తో కూడిన రేష‌న్ కార్డులను అందించారు. అప్ప‌టివ‌ర‌కు రేష‌న్ బుక్స్ (Ration Books) అమ‌లులో ఉన్నాయి. ఆ త‌ర్వాత తెలంగాణ (Telangana) ఏర్పడిన త‌ర్వాత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కొత్త‌గా ల‌బ్దిదారుల‌ను చేర్చిన‌ప్ప‌టికీ.. కార్డులు మాత్రం జారీచేయ‌లేదు. దీంతో 2006లో నాటి కార్డులే వినియోగంలో ఉన్నాయి. అయితే 2023లో కాంగ్రెస్ స‌ర్కార్ (Congress Govt) ఏర్పాడేనాటికి రాష్ట్రంలో 90,36,856 రేష‌న్ కార్డులు ఉండ‌గా 1.59 కోట్ల మంది ల‌బ్దిదారులు ఉన్నారు. కొత్త రేష‌న్ కార్డులు ఇస్తామ‌ని ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారం చేప‌ట్టిన ఏడాదిన్న‌ర త‌ర్వాత‌ 2025లో ఆ ప్ర‌క్రియ చేప‌ట్టింది. కొత్త కార్డులు ఇవ్వ‌డంతోపాటు మార్పులు, చేర్పుల‌కు అవ‌కాశం కల్పించింది. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో రేష‌న్ కార్డుల సంఖ్య 1.05 కోట్ల‌కు చేరింది.

Advertisement
Advertisement