Gen Dhiraj Seth | ‘విజయ్’ నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్
Gen Dhiraj Seth | భారత సైన్యం 31వ అధిపతిగా (Army Chief) జనరల్ ధీరజ్ సేథ్ (Gen Dhiraj Seth) ఛార్జ్ తీసుకున్నారు. ఈ నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి, గౌరవం, దేశమే ప్రథమం అనే ఆదర్శాలకు కట్టుబడి సైన్యాన్ని ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు.
Gen Dhiraj Seth | భారత సైన్యం 31వ అధిపతిగా (Army Chief) జనరల్ ధీరజ్ సేథ్ (Gen Dhiraj Seth) బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (War Memorial)ను సందర్శించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అంతకు ముందు సౌత్ బ్లాక్ లాన్స్ వద్ద గౌరవ వందనం స్వీకరించారు. ఈ నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి, గౌరవం, దేశమే ప్రథమం అనే ఆదర్శాలకు కట్టుబడి సైన్యాన్ని ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా తన తండ్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఎం సేథ్‌కు ఆయన సెల్యూట్ చేశారు.
కర్తవ్యం, గౌరవం, దేశమే ప్రథమం..
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆర్మీ చీఫ్ ధీరజ్ సేథ్ మాట్లాడుతూ.. "ఈ పదవిని చేపట్టడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కర్తవ్యం, గౌరవం, దేశమే ప్రథమం (Duty, Honour and Nation First) అనే ఆదర్శాలకు కట్టుబడి నేను ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. భారత సైన్యం ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. యుద్ధభూమిలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సామర్థ్యం, సన్నద్ధత మన సైన్యానికి ఉంది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో భారత సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది" అని ఆర్మీచీఫ్ ధీరజ్ సేత్ తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
VIDEO | Delhi: After assuming charge, Chief of the Army Staff General Dhiraj Seth says, “Today, as I assume the appointment of the 31st Chief of the Army Staff of the Indian Army, it is a moment of pride and humility for me. With an unwavering commitment to the ideals of Duty,… pic.twitter.com/ybRnSz8dCq
— Press Trust of India (@PTI_News) July 1, 2026
'విజయ్' నినాదం
'విజయ్' (VIJAY) అనే నినాదంతో తన ప్రాధాన్యతలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో నిరంతర నిఘా (Vigilance), వినూత్న ఆవిష్కరణలు (Innovation), వైమానిక-నౌకాదళాలతో సమన్వయం (Jointness), ఆత్మనిర్భరత (Atmanirbharta), సైనికుల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యం (Yodha First) అనే ఐదు అంశాలే తన ప్రధాన లక్ష్యాలని వివరించారు. ప్రధాని మోదీ సాయుధ బలగాల కోసం ఇచ్చిన ‘జై’ (JAI – జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్) మంత్రమే తన ‘విజయ్’ ప్రాధాన్యతలకు పునాది అని తెలిపారు. ఇది తమను విజయంవైపు నడిపిస్తుందని జనరల్ సేథ్ చెప్పుకొచ్చారు.
VIDEO | Delhi: Chief of the Army Staff General Dhiraj Seth lays wreath at War Memorial.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UQSg8iQ5ZA
— Press Trust of India (@PTI_News) July 1, 2026
Also Read..
భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. రూ.లక్షల్లో నష్టం..!
ప్రైమ్ వీడియోస్‌లో యాడ్స్ వివాదం.. చట్టపరమైన చిక్కుల్లో అమెజాన్
సంబంధిత వార్తలు

Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనన్న రాఘవ లారెన్స్.. త్రిషకు లైన్ క్లియర్ అయినట్టేనా?
జూన్ 30, 2026

Gen Dhiraj Seth | ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతల స్వీకరణ
జూన్ 30, 2026

Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Bandi Bageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ.. జులై 3కి వాయిదా
- ●GST | జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లకు చేరిక..
- ●Chevella | ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
- ●MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్.. రావణాసురుడి బాటలో బీజేపీ
- ●Telegram | టెలిగ్రామ్‌లో మళ్లీ మెసేజ్ ఎడిట్ ఫీచర్.. పాత తరహాలోనే పనిచేస్తుంది..
- ●Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడల్.. 4 సెకన్లలో ఏఐ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది..

Bandi Bageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ.. జులై 3కి వాయిదా

GST | జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లకు చేరిక..

Chevella | ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి

MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్.. రావణాసురుడి బాటలో బీజేపీ



