Amazon | ప్రైమ్ వీడియోస్‌లో యాడ్స్ వివాదం.. చట్టపరమైన చిక్కుల్లో అమెజాన్
Amazon | ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్ సర్వీస్‌లో నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా.. యాడ్స్ లేకండా (ad free streaming) చూడాలనుకునే సబ్స్క్రైబర్ల నుంచి అదనపు రుసుము వసూలు చేస్తోందంటూ అమెజాన్ (Amazon)పై ఆస్ట్రేలియన్ కాంపిటిషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ACCC) ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేసింది.
Amazon | ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ (Amazon) చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఆస్ట్రేలియా (Australia)లో ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్ సర్వీస్‌లో నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా.. యాడ్స్ లేకండా (ad free streaming) చూడాలనుకునే సబ్స్క్రైబర్ల నుంచి అదనపు రుసుము వసూలు చేస్తోందంటూ ఆస్ట్రేలియన్ కాంపిటిషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ACCC) అమెజాన్‌పై ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేసింది.
అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కాంట్రాక్టుల్లోని నిబంధనలు వినియోగదారులకు నష్టం కలిగించేలా ఉన్నాయని, కస్టమర్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సేవల్లో భారీ మార్పులు చేసిందని ఏసీసీసీ (ACCC) ఆరోపించింది. ఈ మార్పు కారణంగా నవంబర్ 2023 నుండి ఆగస్టు 2025 మధ్య కాలంలో 10 లక్షల కంటే ఎక్కువ మంది వార్షిక ప్రైమ్ సబ్స్క్రైబర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. "అమెజాన్ ఆస్ట్రేలియా తన వార్షిక ప్రైమ్ సబ్స్క్రైబర్ల ఒప్పందాల్లో పలు అన్యాయమైన నిబంధనలను చేర్చింది. ఆ నిబంధనల ఆధారంగానే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి యాడ్స్‌ను తీసుకొచ్చింది" అని ACCC ఒక ప్రకటనలో తెలిపింది.
ఆస్ట్రేలియాలో యాడ్-ఫ్రీ (Ad-free) స్ట్రీమింగ్ కోసం ఇప్పటికే సబ్స్క్రిప్షన్ చెల్లించిన వినియోగదారులకు.. 2024 నుంచి ఎలాంటి సమాచారం లేకుండా యాడ్స్‌ను అమెజాన్ ప్రారంభించింది. దీంతో అప్పటికే ఏడాది మొత్తానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్న 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ప్రకటనలతో కూడిన వీడియోలను చూడాల్సి వచ్చిందని ఏసీసీసీ తెలిపింది. ఒక వేళ ఎలాంటి ప్రకటనలు లేకుండా కంటెంట్ చూడాలనుకుంటే సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనపు రుసుము చెల్లించాల్సిందేనని అమెజాన్ నిబంధన పెట్టినట్లు పేర్కొంది.
దీంతో యాడ్స్ లేని స్ట్రీమింగ్ కోసం సబ్స్క్రైబర్లు నెలకు అదనంగా 2.99 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక అప్పటికే వారు వార్షిక ప్రైమ్ మెంబర్ షిప్ కోసం ముందస్తుగా 79 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించి ఉండటం గమనార్హం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి రూల్స్ పెట్టడం ముందస్తుగా పూర్తి రుసుము చెల్లించిన వినియోగదారులను అన్యాయం చేయడమేనని ఏసీసీసీ కోర్టుకు వివరించింది. వినియోగదారులకు పరిహారంతో పాటు అమెజాన్‌కు భారీ జరిమానాలు విధించాలని కోర్టును కోరింది.
Also Read..
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రెగ్యులర్ డిగ్రీ చేస్తున్నారా?.. అయితే ఆ పట్టా చెల్లదు..
అమెరికా డాలర్ ఎఫెక్ట్.. రోజు రోజుకీ భారీగా పడిపోతున్న బంగారం ధరలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha | పొలిటికల్ లీడర్‌గా త్రిష – రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో…
ఆగస్టు 21, 2026

Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ – ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్
ఆగస్టు 20, 2026

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ – సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?



