GST | జూన్‌లో జీఎస్‌టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లకు చేరిక..
GST | దేశంలో జూన్ నెలకు సంబంధించిన స్థూల జీఎస్‌టీ (GST) వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 13.9 శాతం పెరిగి రూ.1,94,812 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఈ వసూళ్లు రూ.1,71,105 కోట్లుగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
GST | దేశంలో జూన్ నెలకు సంబంధించిన స్థూల జీఎస్‌టీ (GST) వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 13.9 శాతం పెరిగి రూ.1,94,812 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఈ వసూళ్లు రూ.1,71,105 కోట్లుగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. రీఫండ్‌లు మినహాయించిన తర్వాత నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.1,62,377 కోట్లుగా నమోదై, ఏడాది క్రితంతో పోలిస్తే 11.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జూన్ నెలలో మొత్తం జీఎస్‌టీ రీఫండ్‌లు రూ.32,436 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి రూ.25,121 కోట్లుగా ఉండగా, ఈసారి 29.1 శాతం భారీ పెరుగుదల నమోదైంది. పన్నుల విభాగాల వారీగా చూస్తే, సెంట్రల్ జీఎస్‌టీ (CGST) వసూళ్లు రూ.37,376 కోట్లుగా నమోదై 8 శాతం పెరిగాయి. స్టేట్ జీఎస్‌టీ (SGST) రూ.45,116 కోట్లకు చేరి 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ (IGST) రూ.52,282 కోట్లుగా నమోదై 7 శాతం పెరిగింది.
మహారాష్ట్ర టాప్..
అయితే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది దిగుమతులపై వసూలైన ఐజీఎస్‌టీ (IGST). ఇది 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లకు చేరింది. మరోవైపు దేశీయ స్థూల జీఎస్‌టీ వసూళ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, అవి 6.5 శాతం పెరిగి రూ.1,34,774 కోట్లుగా నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, మహారాష్ట్ర అత్యధిక జీఎస్‌టీ వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.30,714 కోట్ల జీఎస్‌టీ వసూలై, గతేడాదితో పోలిస్తే 9 శాతం పెరుగుదల నమోదైంది. పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక వృద్ధిని ఉత్తరప్రదేశ్ నమోదు చేసింది. అక్కడ జీఎస్‌టీ వసూళ్లు 19 శాతం పెరిగి రూ.9,165 కోట్లకు చేరాయి. గుజరాత్‌లో వసూళ్లు 12 శాతం పెరిగి రూ.11,743 కోట్లుగా నమోదయ్యాయి. కర్ణాటకలో 10 శాతం వృద్ధితో రూ.12,937 కోట్లు, హర్యానాలో 9 శాతం పెరుగుదలతో రూ.10,065 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. ఇక పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు మాత్రం భిన్న ధోరణిని చూపించింది. అక్కడ జీఎస్‌టీ వసూళ్లు 2 శాతం తగ్గి రూ.9,776 కోట్లుగా నమోదయ్యాయి.
తాజావార్తలు
- ●Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
- ●Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం
- ●LPG e-KYC Deadline 2026 | గ్యాస్ కనెక్షన్ ఉందా? e-KYC లాస్ట్ డేట్ పెంపు.. మొబైల్లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి
- ●MLA Rajagopal Reddy | రేవంత్‌కు బాకా కొట్టండి.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్
- ●TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'
- ●Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు

Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం

LPG e-KYC Deadline 2026 | గ్యాస్ కనెక్షన్ ఉందా? e-KYC లాస్ట్ డేట్ పెంపు.. మొబైల్లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి

MLA Rajagopal Reddy | రేవంత్‌కు బాకా కొట్టండి.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్






