Gen Dhiraj Seth | ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతల స్వీకరణ
Gen Dhiraj Seth | భారత సైన్యం నూతన అధిపతి (Army Chief)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ (Gen Dhiraj Seth) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) నేడు పదవీ విరమణ చేశారు.
Gen Dhiraj Seth | భారత సైన్యం నూతన అధిపతి (Army Chief)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ (Gen Dhiraj Seth) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) నేడు పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే ద్వివేది స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2028 ఆగస్టు 31 వరకు ఆయన ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (VCOAS)గా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఇప్పుడు ఆర్మీ చీఫ్‌గా ప్రమోట్ అయ్యారు.

నేడు పదవీ విమరణ చేస్తున్న సందర్భంగా జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల అజేయమైన ధైర్యసాహసాలను, వారు చేసిన అత్యున్నత త్యాగాలను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటించారు. అంతకు ముందు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్ వద్ద ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు. ఇక వీడ్కోలు సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. తన బాధ్యతలను ధీరజ్ సేథ్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఒక అనుభవజ్ఞుడైన సైనికుడని అన్నారు. మన సైన్యం ఎల్లప్పుడూ తన సంప్రదాయాలకు కట్టుబడి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.




సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kyama Mallesh | ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డా? కచ్చితంగా అడ్డుకుంటం
- ●Sudha Kongara | రెమ్యూనరేషన్ కోసం కోర్టులో కేసు వేసిన తమిళ డైరెక్టర్ - వివాదంలో శ్రీలీల సినిమా
- ●UIDAI | ఎం-ఆధార్ యాప్‌కు యూఐడీఏఐ గుడ్‌బై.. అందరూ కొత్త యాప్ వాడాల్సిందే..
- ●DK Shivakumar | ఓటు కోల్పోతే.. ఉచితాలు కోల్పోతారు.. SIR నేపథ్యంలో ప్రజలకు డీకే కీలక హెచ్చరికలు
- ●OnePlus N6 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6 ఫోన్.. అదిరిపోయే ఏఐ ఫీచర్లు..
- ●Sridhar babu | మంత్రి శ్రీధర్‌బాబు దంపతులపై ఏఐ వీడియో కలకలం.. సోషల్ మీడియాలో వైరల్

Kyama Mallesh | ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డా? కచ్చితంగా అడ్డుకుంటం

Sudha Kongara | రెమ్యూనరేషన్ కోసం కోర్టులో కేసు వేసిన తమిళ డైరెక్టర్ - వివాదంలో శ్రీలీల సినిమా

UIDAI | ఎం-ఆధార్ యాప్‌కు యూఐడీఏఐ గుడ్‌బై.. అందరూ కొత్త యాప్ వాడాల్సిందే..

DK Shivakumar | ఓటు కోల్పోతే.. ఉచితాలు కోల్పోతారు.. SIR నేపథ్యంలో ప్రజలకు డీకే కీలక హెచ్చరికలు






