Samantha | ఇదే నా సిక్స్ ప్యాక్.. బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన సమంత
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha Ruth Prabhu) తల్లికాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేసిన సామ్ తొలిసారి బేబీ బంప్ (baby bump) ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha Ruth Prabhu) తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో సామ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. కొన్ని రోజులు మెటర్నటీ లీవ్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఇక తన ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేసిన సామ్ తొలిసారి బేబీ బంప్ (baby bump) ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇదే నా సిక్స్ ప్యాక్ అంటూ ఫన్నీ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్టు తెగ వైరల్ అవుతోంది.
సమంత నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం మూవీ సక్సెస్‌తో పాటూ ప్రెగ్నెన్సీని సామ్ ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడిమోరును సామ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే. సామ్ ప్రెగ్నెంట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొన్న సామ్.. ఇప్పుడు సంతోషంగా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో సామ్ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.

Also Read..
ఏఐ వృద్ధి.. భారత ఐటీ రంగంపై పెను ప్రభావం.. జేపీమోర్గాన్ హెచ్చరిక..
తాజావార్తలు
- ●Heat Deaths Across Europe | భానుడి భగభగలు.. 50 వేల మంది మృత్యువాత.. వాతావరణ మార్పులే కారణమంటున్న పరిశోధకులు
- ●Harish Rao | నాడు సిగాచి.. నేడు సరాక.. కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: హరీశ్ రావు
- ●Air India Flight | టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
- ●EC | సీనియర్ అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు.. పట్టించుకోని కేబినెట్ కార్యదర్శి
- ●Ankita Sharm | చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు.. లేడీ సింగం అంకితా శర్మకు పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు
- ●Gas Leak | సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

Heat Deaths Across Europe | భానుడి భగభగలు.. 50 వేల మంది మృత్యువాత.. వాతావరణ మార్పులే కారణమంటున్న పరిశోధకులు

Harish Rao | నాడు సిగాచి.. నేడు సరాక.. కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: హరీశ్ రావు

Air India Flight | టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

EC | సీనియర్ అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు.. పట్టించుకోని కేబినెట్ కార్యదర్శి






