Bandi Bageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ.. జులై 3కి వాయిదా
Bandi Bageerath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Bandi Bageerath | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జులై 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. పోక్సో కేసులో అరెస్టు అయిన బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఇక భగీరథ్ తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో పలు కీలక అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఇప్పటికే విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, కేసు నమోదైనప్పటి నుంచి దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించానని.. ఈ క్రమంలో తనకు కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Nayara Energy | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు
- ●EV Charging | ఈవీల ఛార్జింగ్లకు సగం ఇళ్లే సిద్ధం.. 45 శాతం గృహాల్లో విద్యుత్ అప్గ్రేడ్ అవసరం..
- ●Lenovo | లెనోవో నుంచి కొత్త ట్యాబ్, గేమింగ్ మానిటర్లు.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Kiara Advani | వెండితెరపై అలనాటి అందాల తార జీవిత కథ.. హీరోయిన్గా కియారా అద్వానీ..! దర్శకుడు ఏమన్నాడంటే..?
- ●VB-G RAM G | ఏపీలో రూ.312, తెలంగాణలో రూ.308.. వీబీ జీరామ్జీ చట్టం కింద చెల్లించే వేతనాలను ఫిక్స్ చేసిన కేంద్రం
- ●Mahesh Kumar Goud | బీజేపీ నేతలు ఓట్ల దొంగలు.. మీనాక్షి సీటు చోరీ చేశారు : టీ పీసీసీ చీఫ్

Nayara Energy | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు

EV Charging | ఈవీల ఛార్జింగ్లకు సగం ఇళ్లే సిద్ధం.. 45 శాతం గృహాల్లో విద్యుత్ అప్గ్రేడ్ అవసరం..

Lenovo | లెనోవో నుంచి కొత్త ట్యాబ్, గేమింగ్ మానిటర్లు.. ఫీచర్లు అదిరిపోయాయి..

Kiara Advani | వెండితెరపై అలనాటి అందాల తార జీవిత కథ.. హీరోయిన్గా కియారా అద్వానీ..! దర్శకుడు ఏమన్నాడంటే..?






