త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram Engagement | జెన్‌జీ నిర‌స‌న‌ల త‌ర్వాత‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా పెరిగిన ప్ర‌ధాని మోదీ ఎంగేజ్‌మెంట్‌.. 289.9% వృద్ధి

Instagram Engagement | జెన్‌జీ నిర‌స‌న‌ల త‌ర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi), ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎంగేజ్‌మెంట్ (Instagram Engagement) భారీగా పెరిగింది. ప్ర‌ధాని ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్ 289.9% వృద్ధి న‌మోదు చేయ‌గా.. రాహుల్ ఖాతాలో 180.7 శాతం పెరుగుద‌ల క‌నిపించింది.

D

National | Published On Aug 26, 2026, 1.32 pm IST

Instagram Engagement | జెన్‌జీ నిర‌స‌న‌ల త‌ర్వాత‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా పెరిగిన ప్ర‌ధాని మోదీ ఎంగేజ్‌మెంట్‌.. 289.9% వృద్ధి
Advertisement

Instagram Engagement | త్రినేత్ర‌.న్యూస్ : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలోని జెన్-జెడ్ (Gen-Z) యువత నిరసనల తర్వాత దేశంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు, నేత‌లు త‌మ సామాజిక వ్యూహాల‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. యువత ఎక్కువగా ఇష్టపడే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నేరుగా వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సాంప్ర‌దాయ రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి యువత ఎక్కువగా ఇష్ట‌ప‌డే రీల్స్ (Reels), మీమ్స్ (Memes), లైవ్ సెషన్ల ద్వారా నేరుగా జెన్‌జీకి చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కేవలం భావోద్వేగ, గుర్తింపు రాజకీయాలకే పరిమితం కాకుండా నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, మౌలిక వసతుల వంటి అంశాలపై చ‌ర్చిస్తూ జెన్-జెడ్‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీంతో జులై 20 కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల త‌ర్వాత ప్ర‌ధాని మోదీ (PM Modi), ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్, బీజేపీల అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టుకు వచ్చే సగటు ఎంగేజ్‌మెంట్ (Average Engagement) రేటు ఒక్కసారిగా పెరిగింది. ఇందులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ముందు వ‌రుస‌లో ఉన్నారు. జెన్ జీ నిర‌స‌న‌ల త‌ర్వాత ప్ర‌ధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేరుగా యువ‌త‌కు చేరువ‌వుతున్న విష‌యం తెలిసిందే. వ‌రుస వీడియోలు విడుద‌లు చేస్తున్నారు. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా రీల్స్ పోస్టు చేస్తూ యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్నారు. ప్ర‌ధాని చేసిన సెల్ఫీ వీడియోలు, సోష‌ల్ మీడియా పోస్టుల‌కు రికార్డు స్థాయిలో స్పంద‌న ల‌భించింది. దీంతో ప్ర‌ధాని సోష‌ల్ మీడియా ఖాతాలో ఎంగేజ్‌మెంట్ రేటు ప్ర‌తి పోస్టుకు 11.9 లక్షల నుంచి 46.3 లక్ష‌ల‌కు పెరిగింది. అంటే దాదాపు 289.9% పెరుగుద‌ల క‌నిపించింది. గ‌తంతో పోలిస్తే ఒక్కో పోస్టుకు దాదాపు 3.9 రెట్లు ఎక్కువ వ్యూస్‌, రియాక్ష‌న్లు వ‌చ్చాయి.

అటు ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ అయ్యారు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెష‌న్లు నిర్వ‌హిస్తూ.. ముఖాముఖి ద్వారా యువ‌త‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సోష‌ల్ మీడియా ఖాతా ఎంగేజ్‌మెంట్ రేటు 1.52 లక్షల నుంచి ఏకంగా 4.26 లక్షలకు ఎగ‌బాకింది. అంటే దాదాపు 180.7 శాతం వృద్ధి న‌మోదు చేసింది. ఇది జులై 20కి ముందున్న స్థాయి కంటే దాదాపు 2.8 రెట్లు ఎక్కువ‌. అదే స‌మ‌యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో యూజర్ల భాగస్వామ్యం ఊహించని విధంగా వృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ఎంగేజ్‌మెంట్ రేటు 50 వేల నుంచి 72వేల‌కు, బీజేపీ ఎంగేజ్‌మెంట్ రేటు 25 వేల నుంచి 34 వేల‌కు పెరిగింది.

Also Read..

కృతి స‌న‌న్ దుస్తుల‌పై వివాదం.. రాఖీ యాడ్ వీడియో తొల‌గింపు

భూముల‌ను రాత్రికి రాత్రే 22ఎ జాబితాలో పెట్టినోళ్లు.. రాత్రికి రాత్రే తీసేయ‌లేరా?

పోస్టాఫీస్‌ పథకం, ఒక్కసారి పెట్టుబడి.. నెలకు రూ.5వేల‌ ఆదాయం..

Advertisement
Advertisement