KTR | మిస్టర్ చీప్ మినిస్టర్.. బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదు: కేటీఆర్
KTR | తన వల్లే పేపర్ లీక్‌లు జరిగాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఐదేండ్ల పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఒక ముఖ్యమంత్రిలా ప్రవర్తించాలని సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు.
KTR | త్రినేత్ర.న్యూస్: తన వల్లే పేపర్ లీక్‌లు జరిగాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఐదేండ్ల పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఒక ముఖ్యమంత్రిలా ప్రవర్తించాలని సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) చురకలంటించారు. పేపర్ లీక్ (Paper Leak) లాంటి దురదృష్టకర ఘటనపై ఫేక్ న్యూస్ (Fake News) ప్రచారం చేయడం ఆయన పదవికే అవమానకరమని మండిపడ్డారు. గ్లోబరీనాతో (Globarena) బీఆర్ఎస్‌కు (BRS) గానీ, తన కుటుంబానికి గానీ, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలో లీగల్ నోటీసులు పంపిస్తానని, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
`తెలంగాణ ముఖ్యమంత్రి తన ఐదేండ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా ఒక ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం ప్రారంభించాలి. పేపర్ లీకేజీల వంటి అత్యంత దురదృష్టకరమైన ఘటనపై అబద్ధపు ప్రచారాలు చేయడం మీ పదవికే అమమానం. దానిని మీ చౌకబారు ఎజెండాల కోసం ఉపయోగించొద్దు. నేను మరోసారి స్పష్టం చేస్తున్నా.. గ్లోబరీనా సంస్థతో బీఆర్ఎస్ పార్టీకి గానీ, నా కుటుంబానికి గానీ, నాకు గానీ ఎలాంటి సంబంధాలు లేవు. వెంటనే నాకు క్షమాపణ చెప్పండి. లేనట్లయితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరలోనే నా లీగల్ టీమ్ మీకు లీగల్ నోటీసులు పంపిస్తుంది మిస్టర్ చీప్ మినిస్టర్ (Cheap Minister). నీ అసభ్యకరమైన, అర్థంలేని ఆరోపణలకు చాలాసార్లు నేను స్పందించను. అందుకని నీతో ఏకీభవిస్తున్నానని కాదు. బురదలో కుస్తీ పట్టడం నాకు ఇష్టం లేదు.. అందుకే మౌనంగా ఉంటా, అంతే` అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Telangana Chief Minister should start acting like a Chief Minister at least once in his solo term
Resorting to peddling fake news on a very unfortunate incident like paper leaks is abhorrent and defaming to your position. Don’t use that for your cheap agendas
Let me reiterate…
— KTR (@KTRBRS) July 23, 2026
పుట్టినరోజు వేడుకలకు దూరం
ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు కేటీఆర్ (KTR) తెలిపారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా, పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా శుక్రవారం (జూలై 24న) ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(BRSV) నిర్వహించే నిరసనలో పాల్గొంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
The voice of India's youth cannot be crushed through force.
I will be joining the BRSV protest tomorrow at 10:00 AM at Indira Park, Hyderabad, in solidarity against the brutal crackdown on students and youth in Delhi
I appeal to students, youth and everyone who believes in…
— KTR (@KTRBRS) July 23, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?






